Alampur jogulamba temple history

Jogulamba, Devi, Temple, Alampur, Mahbubnagar, alampur jogulamba temple history

history of alampur jogulamba temple at Mahbubnagar,

అలంపూర్ జోగులాంల అమ్మవారి ఆలయం

Posted: 11/05/2013 01:00 PM IST
Alampur jogulamba temple history

ఈ భూమి మీద వెలసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో. జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనం ఇచ్చే ఈ అమ్మవార్లలో అలంపూర్ జోగులాంబ దేవాలం ఒకటి. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఈ జోగులాంబ దేవాలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన వెలిసిన ఈ జోగులాంబ దేవాలయం నిత్యం భక్తులకు కరుణా కటాక్షాలు చూపుతూ పూజలందుకుంటున్న ఈ దేవాలయం గురించి...

ఆలయ చరిత్ర

క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.

ఆలయ స్థల పురాణం

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది.

ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.

పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Rigvedam first sooktham

    ఋగ్వేదం (ప్రథమసూక్తము)

    Feb 17 | మాధుచ్ఛందసమ్ ఋగ్వేద సంహిత.  ప్రథమ మండలం.. ప్రథమ అనువాకము.. ప్రథమ సూక్తము. ఋషి (దృష్ట) : విశ్వామిత్రుని కుమారుడైన మధుచ్ఛందసుడు  దేవత : అగ్ని ఛందస్సు : గాయత్రీ ఛందస్సు    1. అగ్నిమీళే... Read more

  • Alampur jogulamba temple history

    అలంపూర్ జోగులాంల అమ్మవారి ఆలయం

    Nov 05 | ఈ భూమి మీద వెలసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో. జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనం ఇచ్చే ఈ... Read more

  • Durga ashtami festival

    విజయ దశమి (దసరా) గురించి

    Nov 05 | విజయదశమి (దసరా) దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ(అశ్వనీ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వీయుజ మాసమౌతుంది.) శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ... Read more

  • Durga ashtami festival

    విజయ దశమి (దసరా) గురించి

    Nov 05 | విజయదశమి (దసరా) దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ(అశ్వనీ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వీయుజ మాసమౌతుంది.) శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ... Read more

  • Chilkur balaji temple history

    చిలుకూరు బాలాజీ టెంపుల్

    Nov 05 | ఇటీవలి కాలంలో బాగా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో చిలుకూరి బాలజీ టెంపుల్ ఒకటి. హైదరాబాద్ కి 30 కిలోమీటర్ల చిలుకూరు గ్రామంలో  ఒస్మాన్ సాగర్ లేక్ సమీపంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ప్రధాన... Read more