The Importance Of Bathing According To Hinduism | Types Of Bathing | Hinduism

Bathing importance according to hinduism types of bath

hinduism, hinduism types, bathing types, bathing style in hinduism, Hindu Traditions, Bathing Tradition, Bathing Style In Hinduism

Bathing Importance According To Hinduism Types Of Bath : The Importance Of Bathing According To Hinduism.

హడావుడిగా స్నానం చేయడం సరైంది కాదు!

Posted: 10/13/2015 05:55 PM IST
Bathing importance according to hinduism types of bath

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరికి స్నానం ఎలా చేయాలోనన్న విషయం అస్సలు తెలియదు. హడావుడిగా బాత్‌రూమ్‌లోకి వెళ్లడం, అలా నాలుగు మగ్గులు ఒంటి మీద నీళ్లు చల్లుకుని స్నానం అయ్యిందనిపించుకుని పనులకు బయలుదేరడం.. ఇలా చాలామంది చేస్తుంటారు. మరికొంత మంది అసలు మొత్తం శరీరం తడవకుండానే స్నానం అయిపోయిందనిపిస్తుంటారు. అయితే.. ఈ విధంగా స్నానం ఆచరించడం ఏమాత్రం సరైంది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. స్నానం ఆచరించుటకు సరైన విధి వుంది. దాని ప్రకారం నడుచుకుంటేనే స్నానం ఆచరించినట్లవుతుంది. దీని గురించి తెలుసుకోవడం కంటే.. మరో విషయాన్ని తెలుసుకోవాల్సి వుంది. స్నానాలు పలురకాలుగా వుంటాయి. అవేమిటంటే..

* సముద్రస్నానం : స్నానాలన్నింటిలో ఇది ఎంతో శ్రేష్టమైంది. ఎందుకంటే ఆ నీటిలో ఉప్పు ఉంటుంది. ఉప్పు వలన శరీరంలోని మలినాలు పూర్తిగా నశించి.. శుభ్రం అవుతారు. అప్పుడు ఎంతో హాయిగా అనుభూతి పొందుతారు.

* నదీ స్నానం : సముద్ర స్నానం తర్వాత ఉత్తమమైంది నదీ స్నానం. ఉదయాన్నే నదీ స్నానం చేయటం వలన చర్మరోగాలు దరిచేరవు. నదులు కొండలూ, కోనలు, చెట్లూ అడవుల గుండా ప్రవహించడం వలన వాటిలో ఎన్నోఔషధ విలువలు చేరుతాయి. అందకే నదీ స్నానం ఆరోగ్యదాయకం అని చెప్తారు.

* పుష్కర స్నానం : పుష్కర సమయంలో స్నానం చేయడం వలన స్త్రీ, పురుషుల చేత పుట్టినప్పటి నుంచీ చేయబడిన పాపం తొలిగిపోతుంది అని నమ్మకం. ఆ సమయంలో మనమే కాదు, ముక్కోటి దేవతలు నదిలో స్నానం ఆచరించి తరిస్తారని భక్తుల విశ్వాసం.

* ఇంట్లో స్నానం : పుష్కరస్నానం తర్వాత వచ్చేది ఇంట్లో చేసే స్నానం. ఎక్కువ వేడిగానీ, బాగా చల్లగా ఉన్న నీటితో గానీ స్నానం చేయకూడదు. గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం వలన శరీరానికి హాయి చేకూరుతుంది. రోగులు, చిన్నపిల్లలు దీనికి మినహాయింపు. హడావుడిగా కాకుండా ఒక పద్ధతిలో స్నానం ఆచరించాల్సి వుంటుంది.

స్నానం చేయటం అనేది ఒక విధి మాత్రమే అనుకుని ముగించుట కన్నా అది ఒక భోగంలా సంతృప్తిగా అనుభవించుట నేర్చుకోవాలి. అందుకే ఆనాడు స్నానఘట్టాలు, స్నాన గదులకు మన వారు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి వుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hinduism bathing  Bathing Types  

Other Articles

  • Pilli shakunam

    పిల్లి శకునం

    Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more

  • Why we use silk clothes in every occasion

    పట్టుబట్టలే ఎందుకు..?

    Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more

  • What is the benefit with mounvrath

    మౌన వ్రతం ఎందుకు???

    Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more

  • What is the eft fall sign

    బల్లి శకునం

    Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more

  • Some unbelives actually have scientific reasons

    మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

    Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more