భారతదేశంలోనే అతి పెద్ద నది అయిన ‘‘గంగానది’’ని మన తెలుగువారు అత్యంత పవిత్రంగా భావిస్తారు. పురాణాలలో కూడా ఈ గంగానదిని ఎంతో విశిష్టత వుంది. పురాణాల ప్రకారం ఈ నదిలో మునిగి తేలితే మనం చేసిన సర్వపాపలూ తుడిచిపోతాయని భావిస్తారు. ఈ గంగానదిని కనిపించే ‘‘సూర్యచంద్రుని’’లా దైవంగా భావిస్తారు. ఈ గంగానది అవతరించిన సందర్భాన్ని బట్టి ‘‘గంగా దసరా’’ అనే పండుగను నిర్వహించుకుంటారు. నదిని పూజించడానికి ఉద్దేశించి.. పదిరోజులపాటు ఘనంగా ఉత్సవాలు జరిగి, శుక్ల దశమితో ముగుస్తుంది. రిషీకేష్, హరిద్వార్, ప్రయాగ్, ఘర్ ముక్తేశ్వర్, వారణాసి వంటి తదుపరి ప్రాంతాల్లో ‘‘గంగా దసరా’’ను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
ఒకనాడు దివిలో వున్న ఈ గంగానదిని భగీరథుడు తపస్సు చేసి భువికి రప్పించాడు. ఆకాశం నుండి వచ్చే గంగ ఉధృతిని భూమి తట్టుకోలేదని మహాశివుడు తన జటాజూటాన్ని ఆసరాగా ఇవ్వగా, అక్కడినుండి నేలకు వచ్చింది. ఆ విధంగా ఉద్భవించిన ఈ పవిత్ర గంగను ఆరాధించేందుకు ఉత్తరాదిన ‘‘గంగా దసరా’’గా సంబరాలు నిర్వహిస్తారు. గంగానదిని మన హిందువులు తల్లిలా, దేవతలా ఆరాధిస్తారు. గంగా దసరా వేడుక సందర్భంగా లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ నదితీరంలో స్నానాలు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా తెలిసీ, తెలియక చేసిన వారు తప్పుల్ని గంగమ్మ తల్లి ప్రక్షాళన చేస్తుందని భావిస్తారు. గంగా జలాన్ని తలపై జల్లుకున్నా పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. ఈ నది తీరప్రాంతపు మట్టిని కూడా అపురూపమైందిగా భావిస్తారు. గంగా దసరా పర్వదినం సందర్భంగా అక్కడకు వెళ్ళిన భక్తులు కొన్ని నీళ్ళను, కొద్దిగా మట్టిని ప్రసాదంలా ఇళ్ళకు తెచ్చుకుంటారు.
గంగాజలాన్ని చిన్న చిన్న పాత్రల్లో ఉంచి, గాలి చొరబడకుండా మూతి బిగించేస్తారు. ఆ నీళ్ళు ఎన్నాళ్ళున్నా, ఎన్నేళ్ళున్నా పాడవవు. చాలామంది ఇలా గంగాజలాన్ని తెచ్చి పూజామందిరంలో ఉంచుకుంటారు. దీనివల్ల శాంతి చేకూరుతుందని, ఎలాంటి కలతలూ, కల్లోలాలూ చెలరేగవని పెద్దలు చెప్తారు. హరిద్వార్ లో గంగానదికి హారతులు సమర్పిస్తారు. నదీప్రాంతంలో వేలాదిమంది కూర్చుని ధ్యానం చేస్తారు. నదిలో పుణ్యస్నానాలు చేసే భక్త జనసందోహంతో తీరప్రాంతాలు కిక్కిరిసి ఉంటాయి. హిమాలయ మంచు పర్వతాల్లో పుట్టిన గంగోత్రిని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి అంటారు. ఒక తరం వెనక్కు వెళ్ళి చూస్తే ఎందరికో కాశీ వెళ్ళి గంగానదిని చూసిరావడం అనేది ఒక పెద్ద కోరిక. ఆ ఆశ తీరినవాళ్ళు తమ అనుభూతులను ఆత్మీయులతో పంచుకుంటారు. మామూలు దినాల్లోనే పూజ్యమైన గంగానది, ఈ ఉత్సవదినాల్లో మరింత ఆరాధ్యమైంది. పన్నెండేళ్ళకు ఒకసారి మాత్రమే గంగానది పుష్కరాలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా పయనించి బంగాళాఖాతంలో కలిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more