ప్రియాంక చోప్రా (Priyanka Chopra)
క్రిమినల్ సైకాలజిస్టు కోర్సు కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతూనే మోడలింగ్ రంగంలోనూ ఒక పాదం మోపింది. ఈమెకి అదృష్టం కలిసి రావడంతో 2000లో మిస్ వరల్డ్ క్రౌన్ సొంతం చేసుకుంది. దీంతో ఈమె కాలేజ్ కి డుమ్మా కొట్టాల్సి వచ్చింది. అన్నట్లు ఈమె అమెరికన్ టెలివిజన్ సిరీస్ అయిన ‘క్వాంటికో’లో ప్రధానపాత్రలో నటిస్తోంది.