ఉదయ భాను
15 ఏళ్ల వయస్సులోనే టీవీ ప్రెజెంటెర్ గా ఎంట్రీ ఇచ్చిన భాను... ఆ తరువాత తన ప్రతిభతో పాపులర్ షోలలో యాంకరింగ్ చేసుకుంటూ దూసుకుపోయింది. ప్రస్తుతమున్న టీవీ పర్సనాలిటీస్ లోనే తనదైన ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకుంది. దీంతో ఈమెకున్న మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి, దర్శకనిర్మాతలు ఈమెను సినిమాల్లో నటించాల్సిందిగా ఆఫర్లు ఇచ్చారు. తద్వారా ఈమె కన్నడ, తెలుగులో పలు సినిమాల్లో నటించింది.