Jesus was married to mary magdalene

Harvard professor suggests that Jesus was married to Mary Magdalenem

Harvard professor suggests that Jesus was married to Mary Magdalene

32.1.png

Posted: 09/20/2012 12:27 PM IST
Jesus was married to mary magdalene

Harvard professor suggests that Jesus was married to Mary Magdalene

ఏసుక్రీస్తు బ్రహ్మచారి కాదా? మేరీ మగ్దలీన్‌తో జీసస్ వివాహమైందా? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. ఈ వివాదమూ ఈనాటిది కాదు. ఏసు ప్రభువుకు వివాహం కాలేదని క్యాథలిక్ చర్చ్ ప్రగాఢవిశ్వాసంతో చెబుతున్నప్పటికీ ఈ విషయంపై పదేపదే చర్చ జరుగుతూనే ఉంది. ఈ కోవలోనే, తాజాగా.. క్రీస్తు, మగ్దలీనాల గురించి ఈజిప్షియన్ కాప్టిక్ భాషలో రాసి ఉన్న పురాతన పత్రం ఒకటి వెలుగు చూసింది. చిన్ని విజిటింగ్ కార్డు సైజులో ఉన్న ఈ జీర్ణ పత్రం క్రీ.శ.నాలుగో శతాబ్దం నాటిది. హార్వర్డ్ డివినిటీ స్కూల్ (కేంబ్రిడ్జ్, మస్సాచుసెట్స్)కు చెందిన డివినిటీ ప్రొఫెసర్ కరేన్ కింగ్ మంగళవారం రోమ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఈ పత్రాన్ని ప్రదర్శించారు.అలాగని, ఈ పత్రం ఏసు ప్రభువుకు భార్య ఉందని చెప్పే చారిత్రక ఆధారం కాదని స్పష్టం చేశారు.అయితే.. జీసస్‌కు పెళ్లయిందనే విషయాన్ని ఈ కొత్త సువార్త నిరూపించలేకపోవచ్చు గానీ, తొలినాటి క్రైస్తవుల్లో కొందరు ఆయనకు వివాహమైందని నమ్మారనేందుకు ఇది మొదటి ఆధారంగా నిలుస్తుందని కరేన్ అభిప్రాయపడ్డారు. అందునా.. 'నా భార్య' అని ఏసు క్రీస్తు ప్రస్తావించినట్టుగా దొరికిన తొలి ఆధారం ఇదేనని ఆమె చెబుతున్నారు.

Harvard professor suggests that Jesus was married to Mary Magdalene

తొలితరం క్రైస్తవుల్లో చాలామంది పెళ్లిని, లైంగిక కార్యాన్ని పాపకార్యంగా భావించలేదు సరికదా.. వాటిని దేవుడి సృజనాత్మకతకు అనుసరణగా భావించారని, ఆధ్యాత్మికంగా ఇది సరైనదేనని అనుకునేవారని ఈ పత్రం తెలుపుతోందని కరేన్ విశ్లేషించారు.ఇంతకీ ఈ పురాతన పత్రం ఎక్కడిదంటే.. ఒక అజ్ఞాత వ్యక్తి సేకరణలోనిది. ఇందులో ఉన్న విషయాలను అనువదించాల్సిందిగా ఆయన కరేన్ కింగ్‌ను ఆశ్రయించారు. దీంతో ఈ విషయం, పత్రం వెలుగులోకి వచ్చాయి. ఈ పత్రం ప్రాచీనతను కొందరు నమ్ముతుండగా మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం దీని విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చినిగి జీర్ణావస్థలో ఉన్న ఒక ప్రాచీన పత్రపు ముక్కలో ఉన్న వాక్యాలను అలాంటి చారిత్రక విషయాలకు ఆధారంగా భావించలేమని టెన్నిసీకి చెందిన ప్రొఫెసర్ జిమ్ వెస్ట్ వంటివారు అభిప్రాయపడ్డారు. వారి అనుమానాలు నిజమో కాదో తేలాలంటే.. ఆ పత్రం ఎప్పటిదో తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.ఈ పత్రంలో మొత్తం ఎనిమిది లైన్లు ఉన్నాయి. అందులో నాలుగో వరుసలో... జీసస్ సెడ్ టు దెమ్, మై వైఫ్.. (జీసస్ వారితో చెప్పాడు, నా భార్య..) అని ఉంది. ఐదో వరుసలో.. 'ఆమె నా శిష్యురాలుగా ఉండగలదు' అని జీసస్ చెప్పినట్టుగా ఉంది. మరో రెండు వరుసల తర్వాత.. "నేను ఆమెతో నివసిస్తున్నాను'' అని చెప్పినట్టుగా ఉంది. నిజానికి క్రీస్తు వైవాహిక జీవితంపై వివాదాలు చరిత్రలో కొత్త కాదు. గతంలో ప్రచురితమైన 'ద డావిన్సీ కోడ్' పుస్తకం కూడా ఈ తరహాలోనే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

Harvard professor suggests that Jesus was married to Mary Magdalene

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ipads in schools this past week
Cocaine filled lollipops for britain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Group politics in congress party

    Sep 20 | రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలు మళ్లీ జోరందుకున్నాయి. ముఖ్యమంత్రిని మార్చితే తప్ప కాంగ్రెస్‌ గాడిలో పడదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో మంత్రుల జానారెడ్డి, సారయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, సీనియర్‌ నాయకులు... Read more

  • Ap governor meets sonia over telangana issue

    Sep 20 | మన రాష్ట్రగవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన, పలువురు నేతలతో జరుపుతున్న భేటీలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటి అయ్యారు.... Read more

  • Pm speaks to karnataka cm

    Sep 20 | కావేరీ జల వివాదం మళ్లీ ముదురుతున్నది. జలాల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కావేరీ ట్రిబ్యునల్ సమావేశం విఫలమైంది. కావేరీ నుంచి తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు రోజూ 9వేల... Read more

  • Tapeswaram laddu creates record

    Sep 20 | తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో 6,300 కిలోల భారీ లడ్డూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గోదావరి పుష్కరఘాట్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారీ లడ్డూని ఏర్పాటు చేశారు. పర్వదినం సందర్భంగా... Read more

  • Geordie pantsman claims his world record back

    Sep 20 | ఇతడు సూపర్ మ్యాన్‌కే బాబులాంటి వాడు. ఎందుకంటే.. సూపర్ మ్యాన్ డ్రస్సు మీద ఒకే అండర్‌వేర్ వేసుకుంటే.. ఇతడు ఏకంగా 302 అండర్‌వేర్లు వేసుకున్నాడు! బ్రిటన్‌లోని విట్‌బర్న్‌కు చెందిన గ్యారీ క్రెయిగ్(53) సౌత్ షీల్డ్స్‌లో... Read more