బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎంతో మందితో ఎఫైర్లు నడిపటంతో పాటు ముద్దూ ముచ్చట కూడా తీర్చుకొని ఉంటాడు. నాలుగు పదుల వయస్సు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా తిరుగుతూ వర్జిన్ అని చెప్పుకుంటున్న సల్లూభాయ్ గత కొంతకాలంగా రుమేనియా బ్యూటీ లులియా వాంటర్ తో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే.
ఆ మధ్యన వీరిద్దరు విడిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈయన ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న సందర్భంగా తన బ్రహ్మచర్యానికి ఇక స్వస్తి పలకబోతున్నానని, త్వరలో తాను రుమేనియా బ్యూటీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
నాలుగు పదుల వయస్సు దాటిన తరువాత జీవితం రోజు నిట్టూర్పులతో గడుస్తోందని, అందుకే గత కొన్ని రోజుల నుండి పెళ్లి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నానని అన్నాడు. ఇక తన పర్సనల్ లైఫ్ వరకు నాకు మానవత్వం అంటే ఇష్టమని, నలుగురికి సాయం చేయాలని అనుకుంటానని, మతాలను ఇస్లాం, క్రైస్తవ మతాలను నమ్ముతాను..
నా తండ్రి ముస్లిం.. తల్లి హిందువు.. రెండవ తల్లి కాథలిక్.. బావ పంజాబీ.. అయితే ఈసారి మా ఇంట్లోకి బయట నుంచి కోడల్ని తీసుకురావాలనుకుంటున్నానని సల్మాన్ చమత్కరించారు. ఏమైతేనేం సల్మాన్ పెళ్లి వార్త చెప్పగానే ఇన్ని రోజులు ఆయన్ను చేసుకుందామని అనుకున్న వాళ్ళలో మళ్ళీ ఆశలు మొదలయ్యాయని అంటున్నారు. మరి రేమేనియా అమ్మాయిని చేసుకుంటాడో ? పాత జాబితాలో ఉన్న హీరోయిన్ల ఖాతా మళ్ళీ రీ ఓపెన్ చేశాడని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more