UPCOMING Movies

Gopala Gopala Preview

గోపాల గోపాల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘గోపాల గోపాల’. ఇందులో పవన్ తో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత వెంకీ నటిస్తున్న రెండవ మల్టీ స్టారర్ సినిమా ఇది. డైరెక్టర్ డాలి కిశోర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘ ఓ మై గాడ్’ ఆధారంగా ఇది రూపొందుతోంది.

ఈ మద్య తెగ బిజీ అయిన అనూప్ రూబెన్స్ ‘గోపాల గోపాల’కు సంగీతం అందిస్తున్నారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే గౌతం రాజు.., సినిమాటోగ్రఫీ జయనన్ విన్సెంట్ చేతిలో ఉంది. సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రోజునే (15-01-2015) విడుదల చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి కూడా.

కార్తిక్