కొంత మందికి చిన్నప్పటి నుంచీ కొన్ని కోరికలు వుంటాయి. అయితే, కొంత మంది విషయంలోనే అవి నెరవేరుతాయి. రీతూ బర్మేచ కోరిక కూడా అలాగే నెరవేరింది. పెద్దయ్యాక సినిమా తార కావాలని చిన్నప్పటి నుంచీ కలలుకంది. ఆ కల... గత ఏడాది రిలీజైన ‘అహ నా పెళ్లంట’ సినిమా ద్వారా నెరవేర్చుకుంది. కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం ‘వసూల్ రాజా’ చిత్రంలో నటిస్తున్న ఈ ఉత్తరాది ముద్దు గుమ్మ సినిమాయే తన ప్రపంచం అంటోంది.
రీతూ పుట్టిపెరిగింది డిల్లీలో. అక్కడే కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే, ఉద్యోగానికి మాత్రం వెళ్లలేదు. చిన్నప్పటి నుంచి మనసు సినిమా వైపు లాగుతుంటే ఉద్యోగంలో ఎందుకు చేరుతుంది? ఇంట్లో చెప్పింది, తాను సినిమా రంగానికి వెళతానని. అయితే, మొదట్లో ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. తర్వాత మెల్లగా వాళ్లని కన్విన్స్ చేసింది. సరే అన్నారు. దాంతో, ముందుగా మోడలింగ్ వైపు నడిచింది. ఓపక్క ఇలా యాడ్స్‌కి మోడల్‌గా పనిచేస్తూనే, మరోపక్క సినిమాలలో అవకాశాల కోసం ట్రై చేసింది. సరిగ్గా అదే సమయంలో ‘అహ నా పెళ్లంట’ సినిమాకి హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుసుకొని ఆడిషన్‌కి వచ్చింది. లక్ తన పక్కన ఉండడంతో వెంటనే సెలెక్ట్ అయిపోయింది.
‘‘అప్పటికే మోడలింగ్ చేసి వుండడం వల్ల కెమెరా ఫియర్ నాకు లేదు. మామూలుగానే కెమెరా ఫేస్ చేశాను. అయితే, సమస్యల్లా భాషతోనే. తెలుగసలు తెలియదు కదా, చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత మెల్లగా అర్ధమయ్యేది. ఇప్పుడు పర్వాలేదు, మేనేజ్ చేసేస్తున్నాను అంది’’ రీతూ నవ్వుతూ. ఆ సినిమాలోని ‘చినుకులా రాలి...’ పాట తనకు బాగా నచ్చేసిందనీ, ఇప్పటికీ అస్తమానూ ఆ పాటే పాడుకుంటున్నాననీ చెప్పింది.రీతూని చూడగానే అందర్నీ ముందుగా ఆకట్టుకునేది ఆమె స్కిన్ కలర్. అది తన తల్లి తనకు ఇచ్చిన కానుక అంటుంది. అమ్మ కలరే నాకు వచ్చింది. దీని గురించి ప్రత్యేకమైన కేర్ అంటూ ఏమీ తీసుకోను. నేను చేసేది ఒక్కటే... మంచి నీళ్లు బాగా తాగుతాను. నా వెంట ఎప్పుడూ మినరల్ వాటర్ బాటిల్స్ ఉండాల్సిందే. అదే నా గ్లామర్‌ని కాపాడుతోంది అంటుంది రీతూ.
ఇక దుస్తుల విషయం ప్రస్తావిస్తే, పాత్రను బట్టి ఎటువంటి డ్రెస్ వేసుకోవడానికైనా తనకు అబ్జక్షన్ లేదంటోంది. మామూలుగా తనకు వెస్టర్న్ అవుట్ ఫిట్స్ అంటే చాలా ఇష్టమనీ, ఇంట్లో వున్నప్పుడు షార్ట్‌స, టీ షర్ట్‌స వేసుకుంటాననీ చెబుతుంది.‘అహ నా పెళ్లంట’ సినిమా తనకు మంచి పేరు తెచ్చిందంటున్న రీచా... ప్రస్తుతం ‘వసూల్ రాజా ’ చిత్రంలో నవదీప్ సరసన నటిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. పేరు తెచ్చే సినిమాలు చేయాలన్నదే తన అభిమతమని చెప్పింది. అన్నట్టు, రీతూ అన్న రజత్ బర్మేచా కూడా సినీ నటుడే! ‘ఉడాన్’ అనే హిందీ సినిమాలో రజత్ నటించాడు.
ప్రొఫైల్
పూర్తిపేరు : రీతూ బర్మేచా
నిక్‌నేమ్ : రీతూ
పుట్టినతేది : నవంబర్ 6
జన్మస్థలం : ఢిల్లీ
ఎత్తు : 5 అ 4 అం
చదువు : కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ
తనలో నచ్చేది : చిరునవ్వు, కళ్లు.
హాబీస్ : సంగీతం, సినిమాలు,
డ్యాన్సింగ్
ఇష్టాయిష్టాలు
రంగులు : నీలం, నలుపు, తెలుపు
ఫుడ్ : ఇటాలియన్, థాయ్, రాజస్థానీ
నగలు : బ్రేస్‌లెట్స్, రింగ్స్, డైమండ్స్
(And get your daily news straight to your inbox)
Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more
Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు... టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more
Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more
Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more
Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more