గాయకుడు రామకృష్ణ తన యుడిగా కంటే, ‘నువ్వే కావాలి ’ ఫేమ్‌గానే సాయికిరణ్ ఎక్కువమందికి తెలుసు. ‘అనగనగా ఆకాశం ఉంది’ అంటూ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న అయనను సినిమా పరిశ్రమ నిరుత్సాహపరిచినా, టెలివిజన్ మాత్రం అక్కున చేర్చుకుంది. ఒడిదుడుకుల మధ్య సాగుతోన్న తన కెరీర్ గురించి సాయికిరణ్ ఇలా చెబుతున్నారు...
కెరీర్ ఎలా ఉంది సాయికిరణ్‌గారూ?
బాగుంది. శిరిడిసాయి సినిమాలో నటించాను. ప్రస్తుతం ఆటోభారతితో పాటు, తమిళంలో ఒక సీరియల్ చేస్తున్నాను.
సడెన్‌గా సీరియల్స్‌కి షిఫ్టయ్యారెందుకు?
సడెన్‌గా కాదు. అసలు నేను కెరీర్ మొదలుపెట్టిందే ‘శివలీలలు’ సీరియల్‌తో. ఆ తర్వాతే సినిమాల్లోకి వెళ్లాను.నాన్నగారిలా సింగర్ కాకుండా నటుడవ్వాలని ఎందుకనుకున్నారు?పి.సుశీల గారు నాకు నాన్నమ్మవుతారు. ఆవిడ కొడుకు పెళ్లికి కార్డులు పంచడానికి నాన్నతో పాటు నేనూ వెళ్లాను. రజనీ కాంత్ గారికి కార్డు ఇస్తున్నప్పుడు ఆయన నన్ను చూసి, ‘నువ్వు సినిమాల్లో నటిస్తు న్నావు కదా’ అన్నారు. లేదని చెప్తే. ‘ఎక్కడో చూసినట్టు అనిపించింది. నువ్వు నటుడిగా పనికొస్తావు, ట్రై చెయ్యి’ అన్నారు. రజనీకాంతే అలా అన్న తర్వాత ఇక ఆగగలనా చెప్పండి!
నాన్నగారి బ్యాకప్ ఉన్నా సక్సెస్ కాలేదేం?
నువ్వే కావాలి, ప్రేమించు లాంటి మంచి సినిమాలు చేసినా సరైన అవకాశాలు రాలేదు. కారణం నాక్కూడా తెలియలేదు.
కారణం లేకుండా ఎలా ఉంటుంది?
సినిమా అనేది ఒక్కరు బాగా చేస్తే అయి పోయేది కాదు. అన్నీ బాగుండాలి. కానీ నేను నావరకే చూసుకునేవాడిని. హీరో యిన్ బాలేక పోయినా, మరేవైనా లోపా లున్నా చెప్పి మార్పించే ప్రయత్నం చేసే వాడిని కాదు. అలా చేసి తప్పు చేశానేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడైనా ఆ తప్పును దిద్దుకోవచ్చు కదా?
లేదు. ఆ అలవాటుని మార్చుకోవాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, నాకు ఎవరితోనూ వాదించడం, గొడవ పడటం ఇష్టం ఉండదు. ఎవరైనా పిలిచి అవకాశమిస్తే చేస్తాను తప్ప మిగిలినవి నాకు అనవసరం. దానివల్ల నష్టపోయినా నాకు పెద్ద బాధ లేదు.
వెండితెర, బుల్లితెర... ఏది బెటరంటారు?
సినిమాలకి పని చేయడం హాయిగా ఉంటుంది. ఎందుకంటే రోజుకు ఒకటో రెండో సీన్లు షూట్ చేస్తారు. అదే సీరియల్ అయితే రోజుకు రెండు మూడు ఎపిసోడ్లు తీస్తారు. బాగా అలసిపోతాం. కాకపోతే టీవీ ఆర్టిస్ట్ ఎప్పుడూ ఖాళీగా ఉండక్కర్లేదు. సంవత్సరం పొడవునా చేతినిండా పని ఉంటుంది.
సీరియల్స్ అయినా మీలోని నటుడిని తృప్తి పరుస్తున్నాయా?
కచ్చితంగా. తమిళంలో రమ్యకృష్ణతో ఒక సీరియల్ చేస్తున్నాను. అందులో ఓ నెలంతా నేను కోమాలో ఉన్నట్లే చూపిం చారు. దాంతో మార్కెట్టుకు వెళ్లినప్పుడు దుకాణాల్లోని ఆడవాళ్లు గబగబా దగ్గరకు వచ్చేసేవారు. ఎలా ఉన్నావ్ బాబూ అంటూ కన్నీళ్లు పెట్టుకునేవారు. అదంతా నటనని చెప్పినా వినకుండా జాగ్రత్తలు చెప్పేవారు. ఆ అభిమానానికి కళ్లు చెమర్చేవి.
నటన కాకుండా ఇంకా ఏమంటే ఇష్టం?
పాములు పట్టుకోవడం (స్నేక్ క్యాచింగ్) నా హాబీ. ఇప్పటివరకూ ఓ మూడు వేల పాముల్ని పట్టుకుని అడవిలో వదిలిపెట్టా. అది తప్ప నాకు వేరే ఏ ఆసక్తులూ లేవు. నిజానికి నేను చాలా ఆధ్యాత్మికంగా ఉంటాను. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు శివుడు కలలో కనిపించి, తన దగ్గరకు రమ్మని పిలిచాడు. అప్పట్నుంచీ ఏదో ట్రాన్స్‌లో ఉండేవాణ్ని. ఇంట్లోంచి పారిపోవాలని కూడా అనుకున్నాను. కానీ మళ్లీ దేవుడు కలలో కనిపించి ‘పేరెంట్స్‌ని చూసుకోకుండా వదిలేస్తావా’ అని తిట్టినట్టు అనిపించడంతో ఆగాను. కానీ ఎప్పటికైనా హిమాలయాలకు వెళ్లిపోతాను.
మరి మీ భార్యాపిల్లల సంగతి...?
పిల్లలు ఇంకా లేరు. నా భార్య వైష్ణవి గురించి బెంగ అక్కర్లేదు. తనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అయినా... నీ లక్ష్యమేంటని పెళ్లి చూపులప్పుడు అడిగితే, ‘యాభయ్యేళ్లు వచ్చేవరకూ పనిచేసి, తర్వాత ఏ హిమాల యాలకో వెళ్లిపోతా’ అంది. వెంటనే తనని పెళ్లి చేసుకోవాలని డిసైడైపోయా.ఆ నిర్ణయం మారే చాన్‌స లేదా?లేదు. ఈ రంగుల ప్రపంచంలో ఉన్నా నా మనసు ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే లాగుతూ ఉంటుంది. నా అంతిమ లక్ష్యం అదే.
సో... ఉన్నన్నాళ్లు ఇలా ఉంటా. బాధ్యతలు తీరిపోయిన తర్వాత నేను కోరుకున్న మార్గంలో సాగిపోతా.
(And get your daily news straight to your inbox)
Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more
Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు... టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more
Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more
Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more
Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more