Interview with real star srihari

Watch Exlcusive Interview with Real Star Srihari at telugu wishesh.com, Telugu channel, Telugu News, Telugu Video, Interviews

Watch Exlcusive Interview with Real Star Srihari at telugu wishesh.com, Telugu channel, Telugu News, Telugu Video, Interviews

interview with real star srihari.png

Posted: 08/27/2012 03:22 PM IST
Interview with real star srihari

real_star_srihari_interview

Srihari‘పోలీస్‌’తో హీరోగా కెరీర్‌ ఆరంభించ ముందు ఎన్నో ఒడిదొడుకులు... చిన్న పాత్రలతో నటుడిగా ప్రారంభమై... అసమాన ప్రతిభతో టాలీవుడ్‌ హీరోగా ఎదిగిన శ్రీహరి నేటితరానికి ఆదర్శం. ప్రతినాయకుడు, సహాయనటుడు, అన్న, సహచరుడు, అతిధి, కథానాయకుడు... పాత్ర ఏదైనా... దాని ఔచిత్యాన్ని ఔపోషణ పట్టి... ఛాలెంజింగ్‌గా చేసి నిరూపించే నటుడాయన. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలో తనకి తనే సాటి. అందుకే ఆయన డాక్టర్‌ శ్రీహరి. మాస్‌ హీరోగా జేజేలందుకున్న శ్రీహరి చెప్పిన సంగతులివి...

హీరోగా నా కెరీర్‌...

ఆరంభమే హై ఓల్టేజ్‌తో మొదలైంది. తొలిసినిమా ‘పోలీస్‌’ నుంచి వరుసగా 9 విజయాలు సాధించిన ఘనత ఉంది. ‘భద్రాచలం’ టాప్‌ హిట్‌. ‘విజయరామరాజు’ ద్వితీయార్థం చూసి ఉద్వేగానికి లోనుకానివాడుండడు. నా ప్రతి సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటికి 300 పైగానే చిత్రాల్లో నటించాను. ఇదిగాక ప్రస్తు తం అరడజను పైగానే సినిమాలు సెట్స్‌లో ఉ న్నాయి. ఈ వరుసలోనే చూస్తుండగానే పరిశ్ర మలో 26 ఏళ్లు పూర్తయ్యాయి. నాకే వండర్‌ అనిపిస్తోంది. ప్రేక్షకాభిమానులు ఇలాగే ఇంకో 20 ఏళ్లు ఆప్యాయంగా భరించేయాలి. నా కిప్పుడు నటుడిగా ఎంతో పరిణతి వచ్చింది. మరో 20 ఏళ్లపాటు నటించే స్టామినా ఉంది. ఇపుడు ప్రతి పాత్రలో, సన్నివేశంలో పెర్ఫెక్షన్‌ కి ప్రయత్నిస్తున్నా. అలాగే పరిశ్రమకి కొంద రు అవసరం. వారుంటేనే అది మనగలుగు తుంది. ఆ జోన్‌లో నేనున్నానని భావి స్తున్నా. ఫలానా వేషం శ్రీహరి మా త్రమే చేయగలడు అనే స్థాయిని చేరుకున్నా. అదే అవకాశాలి స్తుందిక్కడ. ‘మగధీర’ తర్వాత పిల్ల ల్లో గొప్ప ఫాలోయింగ్‌ పెరిగింది. వారంతా పెరిగి పెద్దయ్యాక నా సినిమాలు చూస్తారు. అది నా క్రెడిట్‌...’’ అని అన్నారు శ్రీహరి.

అన్నీ సంతృప్తినిచ్చిన పాత్రలే...

ఈ ఏడాది నటించిన సినిమాలన్నీ సంతృప్తి నిచ్చినవే. ‘శిరిడిసాయి’లో బాబాని తొలిసారి ఫోటో తీసిన ఆంగ్లేయునిగా, ‘శంకరాచార్య’ లో గురువుగారిగా, ‘యమహోయమః’లో యముడిగా, ‘సర్కార్‌గూండా’లో గూండాగా, ‘పీపుల్స్‌వార్‌’లో ఉద్యమనాయకునిగా, ‘కో అంటే కోటి’లో కో పెట్టించే పాత్రలో... అన్నీ సంతృప్తినిచ్చినవే. ముఖ్యంగా ఆర్‌.నారాయణ మూర్తి సోంపేట నేపథ్యంలో అక్కడి బాధితుల మధ్య తెరకెక్కించిన ‘పీపుల్స్‌వార్‌’లో గొప్ప పాత్ర చేశాను.

దర్శకుడినవుతున్నా...

నా దర్శకత్వంలో ‘డిగ్యాంగ్‌’ తెరెక్కిస్తాను. నేనే రచయిత. దావూద్‌ని దేవుడిని చేస్తే..? అతడితో మంచి పనులు చేయిస్తే? ఎలా ఉం టుంది అనేదే కథ. 10 మంది హీరోలుంటా రు. అలాగే సినీపాత్రికేయుడు నాగు గవరను దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఓ సినిమా చేయనున్నా. కార్పొరేట్‌ కంపెనీలో పనిచేసే యువత ఎలా ఉన్నారనే దానిపై అద్భుతమైన స్క్రిప్టును తయారుచేశాడు నాగు. ఫాస్ట్‌ జనరేషన్‌ని చూపించబోతున్నాడు. అలాగే పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో ఓ కథ రాస్తున్నా. అరటి ఆకులు, మామిడి తోరణాలు, జిమ్ము, లైబ్రరీ, ఆసుపత్రి... ఇన్ని సదుపాయాలు ఉన్న ఓ పెద్ద లోగిలిలోని పోలీస్‌ స్టేషన్‌. దేనికైనా అక్కడికే వెళ్లేలా ఆదర్శంగా ఉండే పోలీస్‌స్టేషన్‌ని చూపించాలనేది నా ఆశ.

Srihari_with_wifeమాటల్లో హైలైట్స్‌

మద్రాసులో సినిమాలు చేసేరోజుల్లో ఎవరైనా నటుడు ఓ కారు కొనాలంటే ఏళ్లు పట్టేది. ఇప్పుడలా కాదు. ఓ సినిమా చేసి సొంత కార్లో తిరుగుతున్నారు. అలా మారిపోయిందంతా.

* ‘అక్షర’ ఫౌండేషన్‌ సేవాకార్యక్రమాలు నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి. పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొంత ‘అక్షర’ చూస్తోంది.

* మా పెద్దబ్బాయి శశాంక్‌ 10వ తరగతి చదువుతున్నాడు. చిన్నోడు మేఘాంశ్‌ 8వ తరగతి. మేఘాంశ్‌కి స్నేహితులెక్కువ. అచ్చం నాలానే.

* నా సినిమాల్లో ‘మగధీర’ పాత్ర ఎప్పటికీ గుర్తుంటుంది. బైట పిల్లలంతా ‘భైరవ’ అని పిలుస్తుంటే తెగ ముచ్చటేస్తోంది.

* నేటి యువహీరోలందరిలో పోటీతత్వం బాగా ఉంది. మంచి అవగాహనతో ముందుకెళుతున్నారు. స్క్రిప్టు, డైలాగుల నుంచి అన్నిటా గ్రిప్‌ పెంచుకుంటున్నారు.

* ‘మున్నాభాయ్‌’ రీమేక్‌ (శంకర్‌దాదా ఎంబిబిఎస్‌)లో ఏటీఎం పాత్ర బాగా నచ్చింది. చేయాలనిపించింది. మిస్సయ్యాను.

* విలన్‌గా నటించేప్పుడు పాత విలన్‌లం దరినీ అనుకరించేవాడిని. ముఖ్యంగా మోహన్‌బాబు, నాగభూషణం, ఎస్వీ రంగా రావు... ఇలా మహామహులు చాలామందే నాకు ప్రేరణ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • Director mohan krishna indraganti interview

    విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

    Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more