Vaibhav surya exclusive interview

Vaibhav Surya, Actor, villain, serial artist, Hero vaibhav, surya.

Vaibhav Surya Exclusive Interview on Andhrawishesh.com

Vaibhav Surya Exclusive Interview.png

Posted: 08/16/2012 12:44 PM IST
Vaibhav surya exclusive interview

Vaibhav_Surya_interview

Vaibhav-suryaఅందరూ హీరో కావాలనుకుంటారు. కానీ వైభవ్‌సూర్య మాత్రం విలన్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. అదేమంటే, హీరోని గొప్పవాణ్ని చేసేది విలనే కదా అంటారు. ఆయన మాటలే కాదు, ఆయన చేసే పాత్రలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. అందుకే ఆయన తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు. ప్రస్తుతం సుమంగళి, కొమరం భీం సీరియల్స్‌తో పాటు మూడు సినిమాల్లో కూడా నటిస్తోన్న వైభవ్  పంచుకున్న భావాలు...

కెరీర్ ఎలా సాగుతోంది?

నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటికి పదిహేనేళ్లయ్యింది. ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు. అయినా కెరీర్ సంతృప్తికరంగానే ఉంది.అసలు నటుడవ్వాలని ఎందుకనుకున్నారు?

మొదట ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్నాను. కానీ ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. నాకేమో నెలంతా ఆఫీసులో కూర్చుని పనిచేయడం ఇష్టంలేదు. ఏం చేసినా వైవిధ్యంగా ఉండాలనుకునేవాణ్ని. అందుకే ఆర్మీ తర్వాత నా చాయిస్ నటన అయ్యింది.తొలి

అవకాశం ఎలా వచ్చింది?

ఏ బ్యాగ్రౌండ్ లేదు. ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. దాంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికి మంజులా నాయుడి ద్వారా నా ఆశ నెరవేరింది. ఆవిడ దర్శకత్వం వహించిన ‘ఫ్యామిలీస్ ప్లానింగ్’లో నటించే అవకాశం దొరికింది.

ఇప్పటివరకూ ఎన్ని సీరియల్స్ చేశారు?

యాభై వరకూ చేశాను. ఓ ఇరవై సినిమాల్లో కూడా నటించాను. సుభాష్ అంబాటి అనీ... ఆయన అమెరికా నుంచి వచ్చి, హైదరాబాద్ ల్యాండ్ మాఫియా మీద ‘సిటీ’ అనే సినిమా తీశారు. దానికి నన్ను హీరోగా తీసుకున్నారు. అదే నా మొదటి

సినిమా.అన్నిట్లోకీ తృప్తినిచ్చిన పాత్ర..?

ఆత్మీయులు, శాంతినివాసం, భార్యా భర్తలు... ఇలా చాలా సీరియల్స్‌లో మంచి రోల్స్ చేశాను. అయితే ‘మనసు చూడ తరమా’లో ఒకే సమయంలో మంచివాడి గాను, చెడ్డవాడిగాను నటించాను. అది ఎంతో సంతృప్తినిచ్చింది. అలాగే ‘నాగాస్త్రం’ కూడా. అందులో నా నటన చూసి బాలాజీ టెలి ఫిల్మ్స్‌వారు పిలిచి మరీ ‘కార్తీకదీపం’లో చాన్స్ ఇచ్చారు!

మీరు నెగిటివ్ పాత్రలకు ఫేమస్ అనుకుంటా...?

అలా అనేం కాదు. రెండూ చేశాను. నిజానికి మొదట్లో నేను నెగిటివ్ రోల్స్‌కి పనికిరానన్నారు. కానీ ‘సిటీ’లో చేశాక అలాంటి ఆఫర్లు వచ్చాయి. చెప్పా లంటే ప్రతినాయకుడి పాత్రయితే నటనకు ఎక్కువ ఆస్కారముంటుంది. ఎందుకంటే ఏ కథకైనా హీరో ఎంత ముఖ్యమో, విలన్ కూడా అంతే ముఖ్యం. అసలు విలన్ అనేవాడు ఉంటేనే కదా, హీరో హీరో అయ్యేది! అందుకే నేను విలన్‌గా చేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంటాను.

మీకెవరైనా రోల్‌మోడల్ ఉన్నారా?

ప్రకాశ్‌రాజ్‌ని నేను ఆదర్శంగా తీసు కుంటాను. ఆయన నటన, ప్రవర్తన, ముఖ్యంగా ఆయన కాన్ఫిడెన్స్‌ని చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటాను.

ఇండస్ట్రీలో మీకు నచ్చేది/నచ్చనిది?

ఈ ఫీల్డ్‌లో సెంటిమెంట్లు ఉండవని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఇక్కడే సెంటిమెంట్స్ ఎక్కువ. ఇళ్లలో పూజలు చేస్తారో లేదో తెలీదు కానీ పొద్దున్న షూటింగుకు రాగానే కెమెరాకి పూజ చేసి, హారతిని అందరూ కళ్లకద్దుకుంటారు. అది చాలా నచ్చుతుంది నాకు. కానీ ఇక్కడ ఎవరైనా పైకి వస్తున్నా డంటే ఏదో ఒకటి చేసి, ఉన్నవీ లేనివీ కల్పించి వారిని కింద పడేయాలను కుంటారు. అది కాస్త బాధనిపిస్తుంది.

మీకలా జరిగిందా?

జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు... మొదట్లో నేనెవరితోనూ ఎక్కువ మాట్లాడే వాడిని కాదు. నా పనేదో నేను చూసుకుని వెళ్లిపోయేవాడిని. దాంతో అందరూ నన్ను పొగరుబోతు అని అనేవారు. ఆ విషయం అర్థమయ్యాక అందరితోనూ చనువుగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాను.

Vaibhavమీ బలాలు/బలహీనతలు ఏమిటి?

చాలా జోవియల్‌గా ఉంటాను. అదే నా బలం. కానీ నాకు కోపమెక్కువ. అలాగే పంక్చువాలిటీ కూడా ఎక్కువ. ఇది మైనస్ అని ఎందుకంటున్నానంటే, అందరూ నాలాగే పంక్చువల్‌గా ఉండాలంటాను. అక్కడే వస్తుంది ప్రాబ్లెమ్!

ప్రాబ్లెమా... అంటే?

ఏముంది? ఏడు గంటలకి రమ్మంటే సరిగ్గా ఆ టైముకి అక్కడుంటాను. అవతలి వాళ్లు రాకపోతే ఎక్కడలేని కోపమొచ్చే స్తుంది. నన్ను రమ్మన్నప్పుడు నువ్వూ రావాలిగా అంటాను. దాంతో నువ్వు మాకు చెప్పేంతవాడివయ్యావా అన్నట్టు మాట్లాడ్డం మొదలుపెడ్తారు. అందుకే ఎవరెలా ఉంటేనేం, మన పని మనం చేసుకుని వెళ్లిపోతే మంచిదని అనుకోవడం మొదలుపెట్టాను.

భవిష్యత్ ప్రణాళికలు...?

కొన్నాళ్ల క్రితం జీ తెలుగు చానల్‌లో ‘థ్రిల్’ అనే రియాలిటీ షో వచ్చింది. ఆ కాన్సెప్ట్ నాదే. దాన్ని నిర్మించింది కూడా నేనే. భవిష్యత్తులో అలాంటివే మరికొన్ని రియాలిటీ షోలు చేయాలను కుంటున్నాను. అలాగే బెస్ట్ విలన్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • Director mohan krishna indraganti interview

    విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

    Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more