Interview with kolaveri di music director

Interview with Kolaveri di music director.Serena Menon, Kolaveri Di, music album, Hindustan Times, Entertainment, Dhanush, Aishwarya, Music, Subramaniam, Dhinka Chika, Ready, Anirudh Ravichander, Shridhar Subramaniam, Tamil film 3

Interview with Kolaveri di music director.gif

Posted: 12/20/2011 11:06 AM IST
Interview with kolaveri di music director

interview

అతని వయసు కేవలం 21. కానీ అతనో పెద్ద సెలెబ్రిటీ. ఆడుతూ పాడుతూ అతడు కట్టిన ఓ పాట... ప్రపంచ నలుమూలలకూ పాకింది. ఇంకా మార్కెట్టులోకి రాకుండానే, యూట్యూబ్ ద్వారా సంగీతప్రియులను ఒక ఊపు ఊపింది! యూట్యూబ్ గోల్డ్ అవార్డును గెలుచుకోవడంతో పాటు టైమ్ మ్యాగజైన్‌లో సైతం స్థానం సంపాదించుకుంది. ఇంతగా సంచలనం సృష్టించిన కొలవెరి డీపాట స్వరకర్త అనిరుధ్ ఫన్‌డేకు చెప్పిన కబుర్లు...
‘3’ సినిమాకు మ్యూజిక్ డెరైక్షన్ చేసే అవకాశం ఎలా వచ్చింది?
ఐశ్వర్య రజనీకాంత్‌తో రెండేళ్లలో నేను 12 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఓరోజు రాత్రి అలానే 10.30 టైమ్‌లో సోనీకి సంబంధించిన షార్ట్ ఫిలిం చేస్తుండగా, ధనుష్, శ్రుతిహాసన్ వచ్చారు. మాటల మధ్యలో ధనుష్ క్యాజువల్‌గా మాటలా ఓ పాట పాడారు! దానికి నేను ట్యూన్ కట్టాను. వెంటనే ఆయన చేత పాడించి రికార్డు చేశాం. లిరిక్స్, ట్యూన్... అంతా 20-25 నిముషాల్లో!
అనుకోకుండా రికార్డ్ చేసినప్పుడు, వీడియో ఎలా తీయగలిగారు?
ముందుగా ప్లానింగ్ అంటూ ఏమీ లేదు... సోని షార్ట్ ఫిలిం తీస్తున్నామని చెప్పాను కదా... వాళ్లు అక్కడే ఉండటంతో వీడియో తీశారు.
అసలు ఐశ్వర్యతో మీకు పరిచయం ఎలా?
రజనీకాంత్‌గారి భార్య లతకి నేను మేనల్లుడిని! నేను, ఐశ్వర్య చిన్పప్పటి నుంచి కలిసి తిరుగుతూ పెరిగాం. ఆమెకు నా సంగీతాభిలాష తెలుసు! అందుకే ఆమె చేసే షార్ట్ ఫిలిమ్స్‌కు నాచేత మ్యూజిక్ చేయించారు.
సంగీతంపట్ల మక్కువెలా ఏర్పడింది? కుటుంబంలో సంగీతకారులెవరైనా ఉన్నారా?
ఎవరూ లేరు! ఇంట్లో నేనొక్కడినే సంగీతం నేర్చుకున్నది. నాలుగేళ్ల వయసులో పియానో వాయించేవాడ్ని. కొంచెం పెద్దవాడినయ్యాక సినిమా పాటల్ని యధాతథంగా వాయించేవాడ్ని. అది గమనించి అమ్మానాన్నా నాకు కర్నాటక సంగీతం నేర్పించారు. కాలేజీలో ఫ్యూజన్ బాండ్, రాక్ బ్యాండ్ అని టీములు ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇచ్చాం.
మీమీద రెహమాన్ స్ఫూర్తి ఏమైనా ఉందా?
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక టీవీ షోలో (ఫ్యూజన్ బ్యాండ్) పాల్గొన్నాను. దానికి ఆయన న్యాయనిర్ణేతగా వచ్చారు. ఆ పోటీలో మా బ్యాండ్‌కు మొదటి బహుమతి లభించింది. దాన్ని ఆయన చేతుల మీదుగా అందుకోవడం ఎంత స్ఫూర్తినిచ్చిందో చెప్పలేను.
మీ కొలవెరిపాట ఆయన విన్నారా?
వినడమే కాదు... దుబాయ్ నుంచి ఒక జర్నలిస్టు ద్వారా అభినందనలు కూడా పంపారు. అయితే, నాకు ఆయన్ని మళ్లీ కలుసుకోవాలని, అభినందనలు నేరుగా పొందాలని కూడా ఉంది!
పాట అంత హిట్ కావడానికి లిరిక్స్ ఎంతవరకు తోడ్పడ్డాయంటారు?
సాహిత్యం లేనిదే పాటే లేదుగా! ఇక, ఈ పాట పూర్తిగా తమిళంలో లేకపోవడంతో అన్ని ప్రాంతాల వారూ ఇష్టపడేందుకు కారణమయ్యింది. ముఖ్యంగా ధనుష్ ఉపయోగించిన బ్రోకెన్ ఇంగ్లిష్ అన్ని వర్గాల వారినీ అలరించింది. ఆన్‌లైన్‌లో పెట్టేముందు రజనీకాంత్‌గారికి వినిపించాను. చాలా బాగుందని మెచ్చుకున్నారు.

ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
ఆన్‌లైన్‌లో వేలకొద్దీ అభినందనలు అందుకున్నాను. స్కాట్లాండ్, పాకిస్తాన్, ఇంగ్లండ్ నుంచి కూడా అభినందనలు వచ్చాయి. మొత్తానికి చాలామంది బాగుందన్నారు.
అమితాబ్ కూడా మిమ్మల్ని అభినందించారట కదా?
అవును. అమితాబ్ నాకు ఫోన్ చేసి మరీ పాట బాగుంది, అభినందనలుఅన్నారు. అది నాకు చాలా పెద్ద విషయం!
వరస్ట్ కామెంట్..?
పాట చెత్తగా ఉందన్నవాళ్లూ ఉన్నారు. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా! అందుకే వారి వ్యాఖ్యలు కూడా తీసుకున్నాను. విమర్శలను కూడా తీసుకుంటేనే కదా రాణించగలం!
వేరే సినిమాలకు ఆఫర్లు వస్తున్నాయా?
కొత్త సినిమాల గురించి తరువాత ఆలోచిస్తాను. ప్రస్తుతం నావి మూడు ఆల్బమ్స్ విడుదల కానున్నాయి. త్రీసినిమా ఆడియో కూడా ఈ నెలాఖరులో విడుదలవుతుంది. అయితే, ఆఫర్లు మాత్రం చాలానే వచ్చాయి.
తెలుగులో...?
వచ్చాయి! అయితే వచ్చిన పేరును చెడగొట్టుకోకుండా ఉండటానికి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ఆఫర్‌నూ అంగీకరించలేదు.
ఒక్కసారిగా ఇంత ఖ్యాతి వస్తుందని ఊహించారా?
నిజంగా ఊహించలేదు! అయితే, ఇట్లాంటి సందర్భాలు 20, 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అది నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను.
మీ ఫేవరేట్ హీరో, సింగర్, మ్యూజిక్ డెరైక్టర్?
తమిళంలో అజిత్, తెలుగులో చిరంజీవి ఫేవరేట్ హీరోలు! సింగర్స్‌లో శ్రేయా గోషల్! సంగీత దర్శకుడు, గాయకుడు రెహమానే!
డ్రీమ్ ప్రాజెక్టు ఏమైనా ఉందా?
ప్రస్తుతానికి ఏమీ లేదు కాని, భవిష్యత్తులో పాత తరం సంగీత దర్శకుల తీరును మళ్లీ తీసుకు రావాలని ఆకాంక్ష ఉంది. ఇప్పుడు ఒక పాటకు మ్యూజిక్ చేయాలంటే, గాయకులు, వాద్య బృందం సెపరేట్‌గా వచ్చి చేస్తారు. అలా కాకుండా పాతతరంలా గాయకులు, వాద్యబృందంతోపాటు లైవ్‌గా రికార్డు చేయాలనుకుంటున్నాను.

అతని వయసు కేవలం 21. కానీ అతనో పెద్ద సెలెబ్రిటీ. ఆడుతూ పాడుతూ అతడు కట్టిన ఓ పాట... ప్రపంచ నలుమూలలకూ పాకింది. ఇంకా మార్కెట్టులోకి రాకుండానే, యూట్యూబ్ ద్వారా సంగీతప్రియులను ఒక ఊపు ఊపింది! యూట్యూబ్ గోల్డ్ అవార్డును గెలుచుకోవడంతో పాటు టైమ్ మ్యాగజైన్‌లో సైతం స్థానం సంపాదించుకుంది. ఇంతగా సంచలనం సృష్టించిన ‘కొలవెరి డీ’ పాట స్వరకర్త అనిరుధ్ ఫన్‌డేకు చెప్పిన కబుర్లు...
‘3’ సినిమాకు మ్యూజిక్ డెరైక్షన్ చేసే అవకాశం ఎలా వచ్చింది?
ఐశ్వర్య రజనీకాంత్‌తో రెండేళ్లలో నేను 12 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఓరోజు రాత్రి అలానే 10.30 టైమ్‌లో సోనీకి సంబంధించిన షార్ట్ ఫిలిం చేస్తుండగా, ధనుష్, శ్రుతిహాసన్ వచ్చారు. మాటల మధ్యలో ధనుష్ క్యాజువల్‌గా మాటలా ఓ పాట పాడారు! దానికి నేను ట్యూన్ కట్టాను. వెంటనే ఆయన చేత పాడించి రికార్డు చేశాం. లిరిక్స్, ట్యూన్... అంతా 20-25 నిముషాల్లో!
అనుకోకుండా రికార్డ్ చేసినప్పుడు, వీడియో ఎలా తీయగలిగారు?
ముందుగా ప్లానింగ్ అంటూ ఏమీ లేదు... సోని షార్ట్ ఫిలిం తీస్తున్నామని చెప్పాను కదా... వాళ్లు అక్కడే ఉండటంతో వీడియో తీశారు.
అసలు ఐశ్వర్యతో మీకు పరిచయం ఎలా?
రజనీకాంత్‌గారి భార్య లతకి నేను మేనల్లుడిని! నేను, ఐశ్వర్య చిన్పప్పటి నుంచి కలిసి తిరుగుతూ పెరిగాం. ఆమెకు నా సంగీతాభిలాష తెలుసు! అందుకే ఆమె చేసే షార్ట్ ఫిలిమ్స్‌కు నాచేత మ్యూజిక్ చేయించారు.
సంగీతంపట్ల మక్కువెలా ఏర్పడింది? కుటుంబంలో సంగీతకారులెవరైనా ఉన్నారా?
ఎవరూ లేరు! ఇంట్లో నేనొక్కడినే సంగీతం నేర్చుకున్నది. నాలుగేళ్ల వయసులో పియానో వాయించేవాడ్ని. కొంచెం పెద్దవాడినయ్యాక సినిమా పాటల్ని యధాతథంగా వాయించేవాడ్ని. అది గమనించి అమ్మానాన్నా నాకు కర్నాటక సంగీతం నేర్పించారు. కాలేజీలో ఫ్యూజన్ బాండ్, రాక్ బ్యాండ్ అని టీములు ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇచ్చాం.
మీమీద రెహమాన్ స్ఫూర్తి ఏమైనా ఉందా?
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక టీవీ షోలో (ఫ్యూజన్ బ్యాండ్) పాల్గొన్నాను. దానికి ఆయన న్యాయనిర్ణేతగా వచ్చారు. ఆ పోటీలో మా బ్యాండ్‌కు మొదటి బహుమతి లభించింది. దాన్ని ఆయన చేతుల మీదుగా అందుకోవడం ఎంత స్ఫూర్తినిచ్చిందో చెప్పలేను.
మీ ‘కొలవెరి’ పాట ఆయన విన్నారా?
వినడమే కాదు... దుబాయ్ నుంచి ఒక జర్నలిస్టు ద్వారా అభినందనలు కూడా పంపారు. అయితే, నాకు ఆయన్ని మళ్లీ కలుసుకోవాలని, అభినందనలు నేరుగా పొందాలని కూడా ఉంది!
పాట అంత హిట్ కావడానికి లిరిక్స్ ఎంతవరకు తోడ్పడ్డాయంటారు?
సాహిత్యం లేనిదే పాటే లేదుగా! ఇక, ఈ పాట పూర్తిగా తమిళంలో లేకపోవడంతో అన్ని ప్రాంతాల వారూ ఇష్టపడేందుకు కారణమయ్యింది. ముఖ్యంగా ధనుష్ ఉపయోగించిన బ్రోకెన్ ఇంగ్లిష్ అన్ని వర్గాల వారినీ అలరించింది. ఆన్‌లైన్‌లో పెట్టేముందు రజనీకాంత్‌గారికి వినిపించాను. చాలా బాగుందని మెచ్చుకున్నారు.

ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
ఆన్‌లైన్‌లో వేలకొద్దీ అభినందనలు అందుకున్నాను. స్కాట్లాండ్, పాకిస్తాన్, ఇంగ్లండ్ నుంచి కూడా అభినందనలు వచ్చాయి. మొత్తానికి చాలామంది బాగుందన్నారు.
అమితాబ్ కూడా మిమ్మల్ని అభినందించారట కదా?
అవును. అమితాబ్ నాకు ఫోన్ చేసి మరీ ‘పాట బాగుంది, అభినందనలు’ అన్నారు. అది నాకు చాలా పెద్ద విషయం!
వరస్ట్ కామెంట్..?
పాట చెత్తగా ఉందన్నవాళ్లూ ఉన్నారు. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా! అందుకే వారి వ్యాఖ్యలు కూడా తీసుకున్నాను. విమర్శలను కూడా తీసుకుంటేనే కదా రాణించగలం!
వేరే సినిమాలకు ఆఫర్లు వస్తున్నాయా?
కొత్త సినిమాల గురించి తరువాత ఆలోచిస్తాను. ప్రస్తుతం నావి మూడు ఆల్బమ్స్ విడుదల కానున్నాయి. ‘త్రీ’ సినిమా ఆడియో కూడా ఈ నెలాఖరులో విడుదలవుతుంది. అయితే, ఆఫర్లు మాత్రం చాలానే వచ్చాయి.
తెలుగులో...?
వచ్చాయి! అయితే వచ్చిన పేరును చెడగొట్టుకోకుండా ఉండటానికి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ఆఫర్‌నూ అంగీకరించలేదు.
ఒక్కసారిగా ఇంత ఖ్యాతి వస్తుందని ఊహించారా?
నిజంగా ఊహించలేదు! అయితే, ఇట్లాంటి సందర్భాలు 20, 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అది నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను.
మీ ఫేవరేట్ హీరో, సింగర్, మ్యూజిక్ డెరైక్టర్?
తమిళంలో అజిత్, తెలుగులో చిరంజీవి ఫేవరేట్ హీరోలు! సింగర్స్‌లో శ్రేయా గోషల్! సంగీత దర్శకుడు, గాయకుడు రెహమానే!
డ్రీమ్ ప్రాజెక్టు ఏమైనా ఉందా?
ప్రస్తుతానికి ఏమీ లేదు కాని, భవిష్యత్తులో పాత తరం సంగీత దర్శకుల తీరును మళ్లీ తీసుకు రావాలని ఆకాంక్ష ఉంది. ఇప్పుడు ఒక పాటకు మ్యూజిక్ చేయాలంటే, గాయకులు, వాద్య బృందం సెపరేట్‌గా వచ్చి చేస్తారు. అలా కాకుండా పాతతరంలా గాయకులు, వాద్యబృందంతోపాటు లైవ్‌గా రికార్డు చేయాలనుకుంటున్నాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • Director mohan krishna indraganti interview

    విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

    Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more