సెన్సార్ బోర్డ్ ఏమాత్రం కట్ చెయ్యకుండా మహేష్ బాబు చిత్రం 1- నేనొక్కడినే కి యుఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే నిర్మాతలు మాత్రం దాన్ని కట్ చేసి కుదిస్తున్నారు! సినిమా విజయవంతమైతే ప్రేక్షకులకు కృతజ్ఞతగానో లేకపోతే మరింత ఆకర్షించటం కోసమో ఒక పాటో డ్యాన్సో జోడించటం కద్దు. అయితే దానికి వ్యతిరేకంగా జరుగుతోంది మహేష్ బాబు 1, నేనొక్కడినే సినిమా విషయంలో.
ఈ సినిమాలో దాదాపూ 20 నిమిషాల నిడివిని తగ్గించటానికి చిత్ర నిర్మాతలు పూనుకున్నారు. అందుకు కారణం, ఈ సినిమా బాగా సాగదీసినట్లుగా, ప్రేక్షకులకు విసుగుకలిగించే విధంగా ఉందన్న టాక్ బయటకు రావటం. చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ అచంట, గోపి అచంట త్రయం సంక్రాంతికి ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తామని చెప్పుకుంటూ వచ్చిన సినిమా మీద నెగెటివ్ టాక్ వస్తుండటంతో దానికి మరమ్మతులు చేపట్టే దిశగా ఈ మార్పులు చెయ్యబోతున్నారు.
అంతేకాదు, ఇది సాధారణంగా చూసే మసాలాను పూరించిన సినిమా కాదని, ఈ సినిమా నిర్మాణం పట్ల నిర్మాతలు, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకం గర్వపడుతోందని కూడా వారు ప్రకటించారు. నిజమే. కొత్త రకం పదార్ధాన్ని తినేటప్పుడు పాతవాటితో దేనితోనూ పోల్చకూడదన్నది సత్యం. ఇప్పుడు చూద్దాం జనవాక్యాన్ని అనుసరించి ఇప్పుడు తగ్గించిన ఈ సినిమాని ఈ రోజు నుంచి ప్రదర్శిస్తామంటున్నారు.
అయితే నిర్మాతలు చేసిన మరో తప్పేమిటంటే, అంత ప్రచారం చెయ్యటం. మహేష్ బాబు కి ఎలాగూ మంచి ఫాలోయింగ్ ఉన్నప్పుడు సినిమా గురించి అంత ఊదరగొట్టగూడదు. ఎంత ఎక్కువ ప్రచారం జరిగితే అంత అంచనా పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఏమాత్రం లోపం ఉన్నా ప్రేక్షకులు నిరాశకు లోనవుతారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more