కష్టాలు, కన్నీళ్లు, వివాదాలు సంజయ్‌దత్ జీవితాన్ని ఎన్నోసార్లు చుట్టుముట్టాయి. యుక్త వయసులోనే మత్తుమందుల కేసు, పెళ్లి పెటాకులు కావడం వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. 1993 ముంబై పేలుళ్ల కేసులో అరెస్టు కావడంతో జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. జీవితం తొలిదశలోనే ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన ఈ ఖల్‌నాయక్ తన జీవితకథకు అక్షరరూపం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. జీవితంలో ఎప్పుడైనా ఆత్మకథ రాయాలనిపించిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘రాయాలనే అనుకుంటున్నాను. ఓసారి ఆ ఆలోచన వచ్చింది. అయితే చాలా పెద్ద తతంగం. ఈ పనికి రచయితలు, ఎడిటర్లు, పబ్లిషర్ల వంటి చాలా మంది నిపుణులు కావాలి. ఇవన్నీ సాధ్యమైతే ఆత్మకథ రాస్తాను’ అని సంజయ్ అంటున్నాడు.
అందరూ సంజుబాబా అని పిల్చుకునే సంజయ్‌దత్ ప్రఖ్యాత నటులు సునీల్‌దత్, నర్గిస్‌ల కుమారుడు, 1986లో రిచాను పెళ్లాడినా బ్రెయిల్ ట్యూమర్ వల్ల ఆమె 1988లో ప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరికి ఒక కూతురు జన్మించగా త్రిశాలా అనే పేరు పెట్టుకున్నారు. 1998లో రియా పిళ్లైతో పెళ్లయినా 2005లో ఇద్దరూ విడిపోయారు. దీని తరువాత మాన్యతాదత్‌ను పెళ్లాడగా ఇద్దరు సంతానం కలిగారు. ఒకప్పుడు మత్తుమందులకు బానిసైన సంజుబాబా.. తండ్రి ఒత్తిడి మేరకు అమెరికా వెళ్లి డీఎడిక్షన్ చికిత్స తీసుకున్నాడు. మత్తుమందుల కేసులో 1982లో అరెస్టై, ఐదు నెలలు జైల్లో ఉన్నాడు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, గ్యాంగ్‌స్టర్ అబూ సలెంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల కారణంగా టాడా చట్టం కింద మళ్లీ జైలుకు వెళ్లాడు. 1993 పేలుళ్ల కేసులో మాత్రం నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇతడు 1981లో రాకీ ద్వారా హిందీ సినిమాల్లోకి వచ్చాడు. సాజన్, సడక్, మిషన్ కాశ్మీర్, వాస్తవ్, మున్నాభాయి ఎంబీబీఎస్ చిత్రాలు మంచి పేరుతెచ్చి పెట్టినా చాలా సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. సంజుబాబా నటించిన పలు సినిమాలు ఈ ఏడాది విడుదలవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more