Teluguwishesh The Attacks of 26-11 Movie Review.png The Attacks of 26-11 Movie Review.png The unstintingly gory recreation of the tragic deaths of 26/11 is a pity because Ram Gopal Varma was once gifted enough as a filmmaker to be able to grip us without it says Trisha Gupta Product #: 42718 stars, based on 1 reviews
  • Movie Reviews

    Movie_Review

    సినిమా  : ది ఎటాక్స్ ఆప్ 26/11

    బ్యానర్   : ఈరోస్ ఇంటర్నేషనల్

    తారా గణం : నానా పటేకర్, సంజీవ్ జైస్వాల్, అతుల్ కులకర్ణి, రవికాలే తదితరులు

    సంగీతం    : అమర్ మోహిలే

    కూర్పు     : సునీల్ వాద్వానీ, అజిత్ నాయర్

    ఛాయా గ్రహణం : హర్ష్ రాజ్ ష్రాఫ్, రవిచందర్

    నిర్మాత     : పరాగ్ సంఘ్వీ

    కథ, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

    నిజ జీవితంలో జరిగిన సంఘటనలు వెండితెర పై ఆవిష్కరించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస డిజాస్టర్ లు దొంగల ముఠా, అప్పల్రాజు, డిపార్ట్ మెంట్, భూత్ రిటర్న్‌లాంటి దారుణమైన ఫ్లాప్‌లతో ప్రేక్షకులను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేసిన వర్మ... ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. నమ్మశక్యం కాని రీతిలో భయంకర వాతావరణం స్రుష్టించి, అనేక మంది ప్రాణాలను పొట్టన పెట్టకున్న ఉద్రవాదులు... ఆ నాటి సంఘటనలు ఇంకా మన కళ్ళముందే కదలాడుతున్నాయి. ఈ సంఘటన అందరికి తెలిసిన విషయమే అయినా, దీనికి సంబంధించిన మూలాలు అంటే, ఉగ్రవాదులు మనదేశంలో ఏవిధంగా చొరబడ్డారు, అనే విషయాల్ని వర్మ తీసుకొని చూపించాడు. మరి అవి ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకున్నాయో ఓసారి చూద్దాం.

    కథ :

    2008 నవంబర్ 26న ముంబైలోని లీపోల్డ్ కేఫ్, చత్రపతి శివాజీ టెర్నినల్, తాజ్ హోటల్, కామా ఆస్పత్రిలలో ఉగ్రవాదులు జరిపిన దాడుల సమయంలో పోలీసులకు ఏం చేయాలో తోయని పరిస్థితులను జాయింట్ కమీషనర్ (నానా పటేకర్ ) దాడుల పై వేసిన కమిటీకి వివరించిన దగ్గరి నుండి 10 మంది ఉగ్రవాదులలో చివరికి ఒక్కడు (కసబ్ ) (సంజీవ్ జైస్వాల్) ఏవిధంగా దొరికాడు, అతని నుండి ఎలాంటి వివరాలు సేకరించారు, చివరికి ఎలా ఉరితీయబడ్డాడు అనేదే కథ.

    కళాకారుళ పని తీరు :

    ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన నానా పటేకర్ నటన ఈ సినిమాకి హైటెల్ గా నిలుస్తుంది. నానా పటేకర్ ని వర్మ ఈ పాత్ర కోసం తీసుకోవడమే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆయన స్వరం కమీషనర్ క్యారెక్టర్ సరిగ్గా సరిపోయింది. ఇక కసబ్ పాత్రలో నటించిన సంజీవ్ జైస్వాల్ ఆ పాత్రకు కరెక్టుగా సరిపోయాడు. కసబ్ ని పోలిన పోలికలు ఉండటంతో, ఇతనే కసబ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇక ఆ పాత్రను సంజీవ్ పోషించిన తీరు అద్బుతం. ఇక మిగతా నటుల విషయానికి వస్తే వారికి అంతగా ప్రాధాన్యత లేదు. అతుల్ కులకర్ణి పేరుకే ఉన్నాడు.

    సాంకేతిక విభాగం :

    ఈ చిత్రానికి అన్ని విభాగాల సాంకేతిక వర్గం బాగా కుదిరింది. ముఖ్యంగా సంగీతం, సినిమాటో గ్రఫీ, ఆర్ట్ డిపార్ట్ మెంట్ . ఈ చిత్రానికి సంగీతం అందించిన అమర్ మోహలే అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్. ఇక సినిమాటో గ్రఫీ విషయానికివస్తే బోట్ సీన్స్, హోటల్ సీన్స్ చాలా బాగున్నాయి. వాటిని చూడగానే ఇందులో వర్మ మార్కు ఫ్రేమింగ్ ఉందని అనిపిస్తుంది. ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే... ఒకప్పుడు రామ్‌గోపాల్‌వర్మ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు ప్రేక్షకులు. ఇప్పుడేమో వర్మ సినిమా వస్తోందంటే పట్టించుకోని పరిస్థితి. అలాంటి స్థితిలో ఈ సినిమాని వర్మ ఒక బాధ్యతాయుతమైన దర్శకుడిగా తెరకెక్కించడానని చెప్పవచ్చు. ఈ సినిమా గత సినిమాల్లాగే ఉంటుందని అందరు అనుకుంటే మాత్రం పొరబడ్డట్టే. అక్కడ జరిగిన సంఘటల్ని వర్మకళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాతో వర్మ తాను పోగొట్టుకున్న క్రెడిబులిటీని తిరిగి కొంత సంపాదించుకున్నాడని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే వర్మ దర్శకత్వంలో ఉన్న గొప్పతనం కనిపిందని చెప్పవచ్చు.

    విశ్లేషణ :

    ముష్కరులు మహానగరంలోకి ఎలా ప్రవేశించారు? ముంబైలోని కీలక ప్రాంతాల్లో ఎలా దాడులు చేశారు? ముంబై దాడుల కీలక సూత్రధారి అజ్మల్ కసబ్ ఎలా పట్టుబడ్డాడు? చివరకు ఎలా ఉరి తీశారు ? అనే ప్రశ్నలకు వర్మ సమాధానాలు వాస్తవానికి అద్దం పట్టింది. విచారణ సంస్థ అధికారుల ముందు ముంబై పోలీస్ కమిషనర్ (నానాపాటేకర్) హాజరై.. 2008 నవంబర్ 26న ఏమి జరిగింది? ఎలా జరిగింది? తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను ? కసబ్ ను ఎలా విచారించాను ? అనే విషయాలను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అద్యంతం చిత్రంపై ప్రేక్షకుడి దృష్టి పక్కకు మరల్చకుండా చేయడంలో వర్మ పై చేయి సాధించాడు. ఈ సినిమా చూసిన తరువాత వర్మ అడ్డమైన కథలు కాకుండా ఆలోచించి, ఇలాంటి కథలు రెండేళ్ళకు ఒకటి తీసినా చాలు అనే విధంగా ఉంది. ఈ సినిమాని చూసిన వారు వర్మ కి క్లాప్స్ కొట్టక తప్పదు అని చెప్పవచ్చు. రెగ్యులర్ సినిమాను అశించే ప్రేక్షకులను కొంతమేర నిరాశకు గురిచేస్తుందేమో కానీ...వర్మ చిత్రాలను ఇష్టపడే యువతకు, సినీ అభిమానులకు ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ మంచి విజువల్ ఫీస్ట్ !. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ‘26/11’.. ఆయన కెరీర్ లో ఓ మంచి చిత్రంగా నిలిచిపోవడం మాత్రం ఖాయం

    చివరగా :

    ‘వర్మ ’ దర్శకత్వానికి అద్దం పట్టే సినిమా

    .

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com