Teluguwishesh 1.png 1.png english vinglish review-sridevi Product #: 38627 stars, based on 1 reviews
  • Movie Reviews

    eng_ving_f

    సినిమా పేరు : ఇంగ్లీష్ వింగ్లీష్
    విడుదల తేదీ: 05 Oct 2012
    దర్శకుడు: గౌరీ షిండే
    నిర్మాత: సునీల్ లుల్లా, ఆర్. బల్కీ
    సంగీత దర్శకుడు: అమిత్ త్రివేది
    తారాగణం : శ్రీదేవి, ప్రియా ఆనంద్
    తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.5
    పరిచయం :
           టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ అతిలోక సుందరిగా వెలుగొందిన అల, ఇల నాటి అందాల మణి శ్రీదేవి తాజాగా “ఇంగ్లీష్ వింగ్లీష్” చిత్రం ద్వారా వెండితెరను అలంకరించారు. ఒక అమాయిక సాధారణ గృహిణిగా ఈ చిత్రంలో నటించారు. మేకప్ లేకుండా అందం కన్నా అభినయనికే ఎక్కువ ఆస్కారమున్న పాత్రలో కనిపించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ సమీక్ష మీకోసం..,
    స్టోరీ :
     శశి(శ్రీదేవి) ఒక మామూలు గృహిణి. వంట, పిండివంటలు చెయ్యడంలో ఆమె సిద్ద హస్తురాలు. అలా చేసిన లడ్డులను అమ్మిఆమె కొంత మొత్తం సంపాదిస్తుంది. కాని తనకి వచ్చిన సమస్యల్లా తనకి ఇంగ్లీష్ చదవటం కాని రాయటం కాని రాదూ. తన కూతురు, భర్త సతీష్(ఆదిల్ హుస్సేన్) ఈ విషయంలో ఆమెను ఆటపట్టిస్తూ ఉంటారు. శశి కూతురు అయితే పదే పదే ఆమెను కించపరుస్తూ మాట్లాడుతుంది. ఒకానొక సందర్భంలో శశి తన అక్క కూతురి పెళ్లి కోసం అమెరికా వెళ్ళవలసి వస్తుంది. ఆమెకు వచ్చిన ఇంగ్లీష్ తో అక్కడ ఎలా గడపలో అని ఆమె ముందు భయపడిపోతుంది అక్కడికెళ్ళాక అక్కడి పరిస్థితులు ఆమెను మరింత భయపెడతాయి. అప్పుడే ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికీ తెలియకుండా ఆ శిక్షణ తీసుకోవడం మొదలు పెడుతుంది. అదే శిక్షణ శిబిరంలో తనతో పాటు పలు దేశాల నుండి వచ్చిన వాళ్ళు చేరుతారు వాళ్ళతో స్నేహం ఆమె జీవితంలో చాలా మార్పు తీసుకొస్తుంది ఫలితంగా శశి ఎలాంటి అధ్భుతాలకు నాంది పలికింది అనేది తెరమీదే చూడాలి.
    అనుకూల ప్రతికూలాంశాలు :
    ఈ సినిమా నూటికి తొంబ్భై శాతం సక్సెస్ ఫుల్ మూవీగానే చెప్పొచ్చు. ఇంగ్లీష్, వింగ్లీష్  సినిమాను శ్రీదేవి ని వేరువేరుగా చూడలేనట్టుగా శ్రీదేవి నటన ఉంది. చిత్రం మొదలయిన కొద్ది నిమిషాలలోనే ప్రేక్షకుడు ఆమె పాత్రకి కనెక్ట్ అయిపోతాడంటే ఆమె నటన గురించి అర్ధం అయిపోతుంది. సున్నిత మనస్తత్వం గల గృహిణి పాత్రలో ఆమె నటన అద్భుతం. ఇక తమిళ సూపర్ స్టార్ “తలై” అజిత్ కనిపించింది కాసేపే అయినా ఆ కాసేపట్లోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టారు. ఇంగ్లీష్ చిత్రాన్ని తెలుగులో అనువదించి చెప్పడం, ఇమిగ్రేషన్ వద్ద అయన చెప్పిన డైలాగ్ సినిమా కి హైలెట్స్. (అజిత్ పాత్రను హిందీలో “అమితాబ్ బచ్చన్ చేశారు). ఇక ఆదిల్ హుస్సేన్ శ్రీదేవి నటనకి మంచి సహాయం అందించారు. ప్రియ ఆనంద్ తన పాత్రకి సరిగ్గా సరిపోయింది అందంగా కనిపించడమే కాకుండా కీలక సన్నివేశాలలో తన అభినయం చాలా బాగుంది. చిన్న పిల్లాడు శివాన్ష్ కోటియా కూడా శ్రీదేవి కొడుకుగా పూర్తి మార్కులు కొట్టేసాడు. ఫ్రెంచ్ కుక్ పాత్రలో మెహ్ది నేబ్బౌ బాగా చేశారు. సల్మాన్ ఖాన్ పాత్రలో కనిపించిన సుమిత్ వ్యాస్ మరియు రామ మూర్తి పాత్రలో కనిపించిన రాజీవ్ రవి చంద్రన్ హాస్యాన్ని పండించడంలో సఫలం అయ్యారు. ప్రతి సగటు ప్రేక్షకుడి హ్రుదయాన్ని తాకే కథాంశం ఈ సినిమా. ఈ సినిమాలో ప్రతికూలాంశాలకు చాలావరకూ తావేలేదు.
    టెక్కికల్ టీం వర్క్ :
    ఎడిటింగ్ సందర్భానుసారంగా ఉంది. అమిత్ త్రివేది అందించిన సంగీతం కొత్తపుంతలు తొక్కింది. లక్ష్మణ్ ఉతేకర్ అందించిన సినిమాటోగ్రఫీ సూపర్. దర్శకురాలిగా గౌరీ షిండే వందకి వంద మార్కులు కొట్టేసింది.
    ముగింపు :
    చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు ఓ మంచి ఆహ్లాదకరమైన చిత్రం వెండితెరపై సాక్షాత్కారమైంది.

    ...avnk

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com