సినిమా పేరు : ‘చారులత’
విడుదల తేదీ: 21 సెప్టెంబర్ 2012
దర్శకుడు : పోన్ కుమరన్
నిర్మాత : రమేష్ కృష్ణమూర్తి
సంగీతం: సుందర్ సి బాబు
నటీనటులు : ప్రియమణి, శరణ్య, సీత
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.75
చాలెంజింగ్ లేడీ ఓరియంటెడ్ సినిమా ‘చారులత’లో ప్రియమణి అవిభక్త కవలలుగా ద్విపాత్రాభినయం చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రియమణి నటించిన ఈ సినిమా ఇవాళ రిలీజైంది. ఇప్పుడు ఆసినిమా ఎలా ఉందో చూద్దాం..
చిత్రకథ :
వింతరీతిలో అవిభక్త కవలలుగా పుట్టిన చారు – లత (ప్రియమణి) ఆపరేషన్ చేయించుకోకుండా ఒకరికొకరు అలాగే కలిసి ఉంటారు. వయోలిన్ అంటే మక్కువ ఉన్న చారు-లత వయోలిన్ నేర్పడానికి మాస్టారు నిరాకరించినా పట్టుదలతో వయోలిన్ నేర్చుకుని మాస్టారుని మెప్పిస్తారు. అక్కడే వయోలిన్ నేర్చుకోవడానికి వచ్చిన రవి (స్కంద) చారుని చూసి ప్రేమిస్తాడు. చారు కూడా రవిని ప్రేమిస్తుంది. మరోవైపు లత కూడా రవిని ప్రేమిస్తుంది. రవి చారుని మాత్రమే ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్న లత చారు మీద కసి పెంచుకుంటుంది. ఆ తరువాత జరిగిన పరిణామాలు చారు-లత- రవి ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది సినిమా.
అనుకూల ప్రతికూలాంశాలు :
ప్రియమణి నటన సూపర్. ఎంతటి కష్టమైన పాత్రనైనా చేయగలనని చాటిచెప్పింది. సున్నితమైన మనస్కురాలిగా చారు పాత్రలో, నెగటివ్ షేడ్స్ ఉన్న లత పాత్రలో రెండు పాత్రలకి విభిన్నత చూపించడంలో సక్సెస్ అయింది. చారుని ప్రేమించిన రవి పాత్రలో నటించిన స్కంద కూడా బాగా చేసాడు. చారు-లత తల్లిగా శరణ్య పాత్ర చిన్నదే అయినా పర్వాలేదనిపించింది. చాలా సన్నివేశాల్లో ప్రేక్షకుల్ని భయ పెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో ప్రియమణి ఒంటరిగా ఇంట్లో తిరిగే సమయంలో ఒళ్ళు గగుర్పోడిచేలా భయపెట్టాడు. ఇక.. ఎలోన్ అనే థాయ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లోని కథని మాత్రమే తీసుకున్నారు. కథ చిన్నది కావడంతో స్క్రీన్ ప్లే బలంగా ఉండాలనే విషయం మరిచారు. దర్శకుడు స్టొరీ నేరేషన్ విషయంలో గందరగోళంలో పడ్డాడు. స్టొరీ నేరేషన్ క్లారిటీ లేకుండా చేసాడు. సినిమాకి కీలకమైన ట్విస్ట్ రెవీల్ చేసే సమయంలో ఆసక్తి కలిగించేలా లేకపోవడం బాగా మైనస్ అయింది. పతాక సన్నివేశాలు కూడా సాగాతీస్తూ సహనానికి పరీక్ష పెట్టాడు. కామెడీ కోసం పెట్టిన ట్రాక్ పండలేదు. స్వామిజి పాత్ర కేవలం దెయ్యాలు ఉన్నాయని నమ్మించడానికి మాత్రమే పెట్టినట్లుగా ఉంది. ఆ పాత్రకి ఎండింగ్ లేదు. చారుకి, రవికి లత దెయ్యం రూపంలో కనపడుతున్నట్లు చూపించిన దర్శకుడు నిజంగా దెయ్యం ఉందా లేదా అన్న విషయాన్ని గాలికొదిలేసాడు. సినిమాటోగ్రఫీ బావుంది. సుందర్ సి బాబు సంగీతంలో లాలి లాలి పాట బావుంది. నేపధ్య సంగీతం ఓకే.
ముగింపు :
ఇది ఒక ప్రయోగాత్మక సినిమా. ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమా మనుగడ ఉంటుంది