Teluguwishesh 27.1.png 27.1.png vennela-one-and-half-review Product #: 38395 stars, based on 1 reviews
  • Movie Reviews

    vvennela_innereeeeచిత్రం పేరు      : వెన్నెల 1 ½
    విడుదల తేదీ    : 21.09.2012
    బ్యానర్            : జీఆర్8 ప్రోడక్షన్స్
    సంగీతం           : సునీల్ కశ్యప్,    
    ఫోటోగ్రఫీ          : సురేష్ భార్గవ్
    నిర్మాత           : వాసు, వర్మ,    
     దర్శకత్వం       : వెన్నెల కిషోర్
    నటీనటులు      : చైతన్య కృష్ణ, మోనాల్ గుజ్జార్, వెన్నెల కిషోర్, శ్రవణ్, బ్రహ్మనందం, రఘుబాబు, మాస్టర్ భరత్ తదితరులు..
    తెలుగువిశేష్.కాం రేటింగ్ : 1.5

    పరిచయం :
            ‘వెన్నెల’(2005)లో వచ్చిన సినిమాకు కొనసాగింపుగా రూపొందించిందే ఇవాళ విడుదలైన ఒకటిన్నరవెన్నెల. అప్పటి వెన్నెలలో రాజా, పార్వతి మెల్టన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఆ సినిమా అప్పట్లో మంచి హిట్టయ్యింది. వెన్నెల చిత్రంతో పరిచయమై ఆ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నహస్యనటుడు వెన్నెల కిషోర్ ఈ తాజా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ సమీక్ష ఇప్పుడు..

     స్టోరీ :   వెన్నెల సినిమాలో పాత్రలు వెన్నల కిషోర్, కరీం లు కొన్ని కారణాలతో అమెరికాను విడిచి బ్యాకాంగ్ వెళ్లవలసి వస్తుంది. అక్కడ వారికి కృష్ణ కృష్ణ (చైతన్య కృష్ణ) పరిచయం అవుతాడు. కృష్ణ కృష్ణ ప్రేమికులను విడదీసి ఉపాధి పొందుతుంటాడు. ఈ క్రమంలో వెన్నల (మోనాల్ గుజ్జాల్), అమెతో ఎంగేజ్ మెంట్ అయిన శ్రవణ్ ను వీడిదీస్తాడు. వెన్నెల తో ప్రేమలో పడతాడు. చివరికి కృష్ణ కృష్ణ , వెన్నెల ఏ విధంగా కలుసుకున్నారు. శ్రవణ్ చివరి ఏమయ్యాడు. అసలు, వెన్నెల, శ్రవణ్ లను వీడదీయమని కృష్ణకృష్ణకు ఏవరు చెప్పారు..? అనేదే ముఖ్య కథాంశం. ఈ వెన్నెల 1 1/2 సినిమా ఫ్లాష్ బ్యాక్ ప్రకారంగా నడుస్తుంది. ఈ కధను వెన్నెల కిషోర్.. తాగుబోతు రమేష్ కు చెబుతుంటాడు.

    అనుకూల ప్రతికూలాంశాలు :  హీరో చైతన్య కృష్ణ, హీరోయిన్ మోనాల్ గుజ్జాల్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాలోని కథ, కథనాలు వెన్నెల కిషోర్ చుట్టూ సాగుతుంటాయి. తనకు లభించిన పాత్రలో శ్రవణ్ బాగా నటించాడు. మాస్టర్ భరత్ ఇక నుంచి మిస్టర్ భరత్ గా మారనున్నాడు. బ్రహ్మనందం, రఘబాబు తదితరలు తమ తమ పాత్రల పరిధిలో నటించారు. మొత్తంగా కామెడి సన్నివేశాలు, వెన్నెల కిషోర్ నటన, డైలాగులు బావున్నాయి. కస్టమర్ కేర్ ఫోన్ సహాయంతో మైక్రో ఓవెన్, వాషింగ్ మిషన్, కంప్యూటర్ లను ఉపయోగించే సన్నివేశాలు, హీరోయిన్ కు కొరియర్ చేసిన సిడిని అమెకు అందకుండా చేయడానికి చేసే ప్రయత్నాలు వంటి సన్నివేశాలు పండాయి. అయితే చాలా చోట్ల ఓవర్ గా అనిపించే డైలాగులు, సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాతో చేసిన ‘లైవ్ ఇంటర్వెల్’ ప్రయోగం బెడిసికొట్టింది. కథ లో కొత్తదనం కొరవడి, కొన్ని సన్నివేశాలు తేలిపోవటం విచారకరం.

    టెక్నికల్ టీం వర్క్ :  ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. సంగీతం యావరేజ్. వెన్నెల సినిమాలో కొన్ని పాటలను ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు. కొన్ని చోట్ల కామెడీ డైలాగులు బాగా పేలాయి. ఇక దర్శకత్వం విషయానికి వస్తే తనకు పట్టు ఉన్న కామెడీ సన్నివేశాలను కిషోర్ బాగానే రూపొందించాడు.

    ముగింపు : వెన్నెలకి తక్కువ చీకటికెక్కువ ...avnk

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com