Teluguwishesh 28.1.png 28.1.png life is beautiful movie review Product #: 38209 stars, based on 1 reviews
  • Movie Reviews

    life_poster

    సినిమా:                లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
    విడుదల తేదీ :         14.09.2012
    నిర్మాత:                శేఖర్ కమ్ముల
    దర్శకుడు:             శేఖర్ కమ్ముల
    స్టార్ తారాగణం:        ఆరుగురు కొత్త నటులు, అమల, శ్రియా, అంజల జవేరి ...
    సంగీత దర్శకుడు:     మిక్కీ జె. మేయర్
    తెలుగువిశేష్ రేటింగ్:   3

    పరిచయం :
           ఎంతోకాలంగా శ్రమకోర్చి తనదైన శైలిలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరుగురు కొత్త నటీనటులను పరిచయం చేస్తూ ఇంచుమించు హ్యాపీడేస్ తరహాలో తెరకెక్కించిన సినిమా ఇది. ఇంతకుముందు శేఖర్ నిర్మించిన ఆనంద్, గోదావరి, లీడర్, హ్యాపీడేస్ సినిమాల ప్రాధాన్యం ద్రుష్ట్యా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మీదా అందరికీ, ముఖ్యంగా యూత్ కి ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఇవాళే వెండితెరను తాకిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో చూద్దాం...

    కథ : 
          పూర్తిగా శేఖర్ కమ్ముల స్టైల్ లో ఆరుగురు యంగ్ స్టర్స్ చూట్టూ సాగే కథ ఇది. గోల్డ్ ఫేజ్ అనే రిచ్ పీపుల్ ఉండే కాలనీకి, బి ఫేజ్ అనే మధ్యతరగతి పీపుల్ ఉండే కాలనీ యువకుల మధ్య జరిగే ప్రేమ వ్యవహారాలు, చిన్న చిన్న తగాదాలే క్లుప్తంగా ఈ సినిమా. డబ్బున్న వారిలో ఉండే అహంకారం, మధ్యతరగతి వారిలో ఉండే వారిలో ఉండే ప్రేమానురాగాలూ, ఆనందం ప్రముఖంగా ఫోకస్ చేస్తూ శేఖర్ ఈ మూవీ తెరకెక్కించాడు. సినిమాలో చాలావరకూ హ్యాపీడేస్, ఆనంద్ ఆనవాళ్లు కనిపిస్తాయి. 

    అనుకూల ప్రతికూలాంశాలు :
         కొత్త యువ నటులు అభిజిత్, సుధాకర్, కౌశిక్, షాగున్, జరా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్ ఇంకా, శ్రీరామ్ నటన పరంగా సమతుల్యత ప్రదర్శించారు. వీరి మధ్య సాగే సన్నివేశాలు రక్తికట్టించాయి. చాలా కాలం తర్వాత తెరపైకి వచ్చిన అమల సెంటిమెంటల్ పాత్రలో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఇలాగే మళ్లీ తెరపై మెరిసిన అంజలా ఝవేరీ చాలా గ్లామరస్ గా కనిపించింది. శ్రియ కొంతమేర హాట్.. హాట్ గా కనువిందు చేసింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే వర్షం పాట హైలెట్. అన్ని విభాగాలను శేఖర్ కొమ్ముల చాలా శ్రద్ధతో తెరకెక్కించాడని అగుపిస్తుంది.
            ఇక ప్రతికూల అంశాల విషయానికి వస్తే, కథనం నడిచిన తీరు చాలా సందర్భాల్లో బోర్ అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో కనిపించిన నెమ్మది సెకండాఫ్ లోనూ అలాగే సాగటంతో ప్రేక్షకులకు కొంత విసుగు పుట్టించింది. బి, సి సెంటర్ ప్రేక్షకుల మససుదోచుకునే సన్నివేశాలు బహు అరుదు. సినిమా చూస్తున్నంత సేపూ శేఖర్ కమ్ముల పాత సినిమాలు చూసిన అనుభూతే కలుగుతుంది.

    టెక్నికల్ వాల్యూస్ :
          ఆధ్యంతం స్ర్కీన్ కలర్ ఫుల్ గానే కనిపించింది. ఇందులో సినిమాటోగ్రఫీ పనితనం గురించి చెప్పుకోవాల్సిందే. ఇక ఎడిటింగ్, మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఫీల్ గుడ్. స్ర్కీన్ ప్లే, కథలో డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపించాయి. 


    ముగింపు :
          ఇంచుమించు హ్యపీ డేస్ ఫీలింగ్ కలిగించే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బి,సి సెంటర్లలో కష్టమే..

    ...avnk
More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com