Teluguwishesh Nag Shirdi Sai Telugu movie review.png Nag Shirdi Sai Telugu movie review.png The film is not just a devotional to be seen by an older audience. Anyone can see it for the relevance of the simple teachings of the Sai baba. Product #: 37979 stars, based on 1 reviews
  • Movie Reviews

    సినిమా రివ్యూ : 

    Shirdi-Sai

    సినిమా      : ‘శిరిడి సాయి ’
    నటీనటులు :  అక్కినేని నాగార్జున, శ్రీకాంత్‌, శ్రీహరి, సాయికుమార్‌, కమలినీ ముఖర్జీ,
                    తనికెళ్ళ భరణి, శరత్‌ బాబు, రోహిణి హట్టంగడి, వినయప్రసాద్‌, సాయాజీ షిండే,
                    దేవేంద్ర దోడ్కే, బ్రహ్మానందం, కౌశిక్‌ బాబు తదితరులు
    దర్శకుడు :   కే. రాఘవేంద్ర రావు
    నిర్మాత    :  మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి
    సంగీతం   :  కీరవాణి

    టాలీవుడ్ దర్శక కేంద్రుడు రాఘవేంద్ర రావు రక్తిరస చిత్రాలే కాకుండా గతంలో భక్తి రస చిత్రాలు తీసి మెప్పించాడు. గతంలో  ‘అన్నమయ్య, శ్రీరామదాసు ’ వంటి చిత్రాలు తీసి మెప్పించిన ఆయన  ఇప్పుడు ‘శిరిడి సాయి ’ చిత్రాన్ని రూపొందించాడు. గతంలో నాగార్జున భక్తుడిగానే నటించాడు. కానీ ఈ సినిమాలో దేవుడి పాత్రలో నటించాడు. మరి రాఘవేంద్ర రావు ఈ సినిమాని తీయడంలో ఎంతవరకు సఫలం అయ్యాడు, నాగార్జున దేవుడిగా సాయి భక్తులను ఏ మేరకు మెప్పించాడో ఓ సారి చూద్దాం.

    కథ :

    సాయి బాబా చరిత్ర గురించి గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో కూడా అందరికి తెలిసిన కథే పెట్టి తీసినా, సినిమాలో ఎలా దాన్ని చెప్పారు అన్నదే ముఖ్యం. ఈ సినిమాలో సాయిబాబా అవతరించిన తీరు దగ్గరి నుండి సమాధి అయ్యేంత వరకు ఏమి జరిగింది ?  అసలు సాయి బాబా షిరిడీకి ఎందుకు వచ్చారు ? ఆయన్ను భక్తులు దేవుడిగా కొలవడానికి గల కారణాలు ఏమిటి ? ఆయన చేసిన మహిళలు ఏమిటి ? సాయికి వారు ఎలా భక్తులుగా మారారు అన్నదే ఈ సినిమాలో క్లప్తంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. అదే కథ.

    కళాకారుల తీరు :

    ఈ చిత్రంలో మొదట మెచ్చుకోవాల్సింది నాగార్జునని. ఎందుకంటే ఈయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం, గతంలో భక్తునిగా నటించిన ఈయన, ఇందులో దేవుడిగా నటించి భక్తుల్ని తన్మయత్వానికి గురిచేయడం. నాగార్జున లాంటి వారికే ఇలాంటి వారే ఇలాంటి చిత్రాలు చేయగలరని మరోసారి నిరూపించాడు ఆయన. గతంలో ఎన్నో సినిమాలు సాయి మీద వచ్చాయి. కానీ రాఘవేంద్రరావు తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాగార్జున ఇందులో నటించిన తీరు చూస్తుంటే నిజంగా బాబా ఉన్నప్పుడు ఇలాగే ఉండేవారేమో అని అనిపంచే విధంగా నటించాడు. సాయి మరణాన్ని రాఘవేంద్ర రావు చూపించిన శైలి ప్రతి భక్తుడుకి కంటతడి పెట్టిస్తుందనడంలో సందేహం లేదు. ఇందులో నటించిన శ్రీకాంత్ సపోర్టింగ్ పాత్రలో బాగా చేశాడు. కమిలిని ముఖర్జీ తన అభినయంతో ఆకట్టుకుంది. ఇక షయాజీ శిండే, ఆలీ, బ్రహ్మానందాన్ని కామిడీ కోసం వాడుకుందామని చూసినా ఆ పాత్రలు బోర్ కొట్టే విధంగా ఉన్నాయి తప్పితే నవ్వించే విధంగా ఉన్నాయి. ఈ సినిమా వరకు దర్శకేంద్రుడు అలాంటి ప్రక్కన బెట్టి సాయి గురించిన సన్నివేశాలు మరింత లోతుగా పెట్టి ఉంటే బాగుండేంది. శ్రీహరి పాత్ర కూడా అంతగా ఆకట్టుకోలేదు.

    సాంకేతిక వర్గం :

    ఈ సినిమాకి కీరవాణి అందించిన స్వరాలు హైలెట్ గా నిలిచారు. సందర్భాను సారంగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. గతంలో వచ్చిన సాయి గీతాలను పోలిక లేకుండా చేశారు కాబట్టి జనాలు వీటిని ఆదరించిడానికి కొంత టైం పట్టవచ్చు. ఇక పెద్ద పెద్ద మాస్ డైలాగులు రాసి జనాల్లో ఫేమస్ అయిన పరుచూరి బ్రదర్స్ రాసిన సాయి డైలాగుల్లో భక్తి కనిపిస్తుంది. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక చెప్పుకోవాల్సింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి. రక్తి రసాలనే కాకుండా భక్తి రసాలను కూడా పండిచగలడని గతంలో నిరూపించిన రాఘవేంద్రరావు ఈ సినిమాలో కూడా సాయి భక్తులనే కాకుండా, సామాన్య భక్తులను కూడా మెప్పించే విధంగా తీశాడు. ఆ మధ్య తీసిన ‘పాండురంగడు ’ సినిమా భక్తితో తీయక బాలక్రిష్ణ కోసం తీసి చేతులు కాల్చుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ గాడిలో పడ్డాడనే చెప్పాలి.

    ఈ సినిమాకి హైలెట్స్ :

    నాగార్జున నటన
    కీరవాణి సంగీతం
    రాఘవేంద్రరావు తీసిన పతాక సన్నివేశాలు.

    మైనస్ పాయింట్స్ :

    కమర్షియల్ పరంగా ఆలోచించి అనసరంగా పెట్టిన కామిడీ ట్రాక్
    అనవసర కామెడీ పెట్టి సాయి చరితాన్ని లోతుగు చూపించక పోవడం

    చివరగా :

    ఈ సినిమాకి వెళ్లిన వారిని తప్పకుండా ‘శిరిడి సాయి ’ ఆకట్టుకుంటుంది. సాయి బాబా భక్తులు బాగా మెచ్చే చిత్రం అవుతంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమెడియన్స్ తో చేయించిన వెకిలి కామెడీ తప్ప సినిమాలో ఎంచడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రథమార్థం కంటే ద్వితియార్థం చాలా బాగుంటుంది. ద్వితియార్థంలో సాయికి భక్తులుగా ఎలా మారుతారో చూపించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సాయి మహిమల కంటే సాయి గొప్పతనాన్ని బాగా చూపించారు. గతంలో సాయి చిత్రాలు చూడని వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. కుటుంబ సమేతంగా వెళ్లి భక్తి శ్రధ్దలతో చూడాల్సిన చిత్రం ‘‘శిరిడి సాయి ’’.

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com