కేంద్ర మంత్రి చిరంజీవి గారు .. నాకే సిగ్గేస్తుందని మెగా అభిమానులు అంటున్నారు.? గతంలో స్వయం క్రుషితో ఎదిగిన నటుడుగా.. తెలుగు వారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయావు. మీ నటనకు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరును చూసి, తెలుగు రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా మీకు అభిమానులుగా మారిపోయారు. కోట్లాది అభిమానులు కూడగట్టుకున్న ఏకైక నటుడు మెగా స్టార్ సినీ అభిమానులు మదిలో నిలిచిపోయావు. మీ మీద ఉన్న అభిమానమే.. మీ కుటుంబ హీరోలకు అభిమానులమయ్యాం. టాలీవుడ్ లో తిరుగులేని మెగా స్టార్ వెలిగిన మీరు.. ఈ రోజు కంకర రాళ్లు, కోడిగుడ్లు, విమర్శలు, మీకు జై కొడుతున్నాయి. మెగా స్టార్ కే జై అన్న వారే.. ఈరోజు మంత్రి చిరంజీవి గ్యో బాక్ అంటూ నినాదాలు చేసే స్థాయికి వెళ్లిపోయారు.
మెగా స్టార్ చిరంజీవిగా ఉన్నప్పుడు మీ పై అభిమానం ఉండేది.. కానీ మెగా స్టార్ నుండి మంత్రిగా మారిన తరువాత నుంచి మీ పై ఉన్న అభిమానం పోయి అసహనం పెరిగిపోయింది. మెగా స్టార్ చిరంజీవికి, మంత్రి చిరంజీవికి ఉన్న తేడా ఏమిటి? మీరే ఆలోచించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మీకు అభిమానులుగా మారిన తెలుగు ప్రజలను వదిలిపెట్టి, ఇటలీ బొమ్మకు.. మీరు జీ హుజూర్ అనటమే పెద్ద తప్పు. ఒకవేళ మీ రాజకీయ జీవితం కోసం ఇటలీ బొమ్మకు భజన చేసిన పెద్దగా తెలుగు ప్రజలు పట్టించుకోనే వారు కాదు. కానీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన నాటి నుండి సమైక్యాంద్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో ఏ ఒక్క రోజైన తెలుగు ప్రజలు గురించి ఆలోచించావా? సమైక్యాంద్ర ఉద్యమానికి ఉడతంత సాయం కూడా చెయలేని పరిస్థితిలో మీరు ఉండిపోవటమే తెలుగు ప్రజలకు, అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
సామాజిక న్యాయం పేరుతో పార్టీ పెట్టి, ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఎంపీగా రాజ్యసభ సీటు దక్కించుకున్నావు. దీని వలన ఫలితం ఏమిటి? మీరు మంత్రిగా ఉంటే బహుశ కొద్ది రోజులు ఉంటారు. 2014 ఎన్నికల్లో మీరు పోటీ చెయ్యగలరా? మళ్లీ తిరుపతి ప్రజలు మిమ్మల్ని గెలిపించగలరా? అంటే మీ రాజకీయ జీవితం అనేది రాజ్యసభ సభ్యుడుగానే ఉండిపోవాలని మీరు డిసైడ్ అయ్యారు. అందుకే మీరు సోనియా గాంధీ భజన చేస్తూ .. సమైక్యంద్ర ప్రజలు మరిచిపోయారనేది పచ్చినిజం. మీరు ఒక్క అడుగు సమైక్యాంద్ర కోసం వేచి ఉంటే ఈ రోజు మీ పై కంకరాళ్లు , కొడిగుడ్లు, పడేవి కావు. మంత్రి చిరంజీవిలా కాకుండా, మెగా స్టార్ చిరంజీవిలా సమైక్యాంద్ర కోసం ఒక్క అడుగు వేసి ఉంటే ఈరోజు.. మీరు సమైక్యాంద్ర సింహంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయేవారు. మీరు ఇకనైనా ఇటలీ బొమ్మ మత్తులోంచి బయటకు రాండి? సమైక్యాంద్ర కోసం పోరాటం ఉద్యమంలో పాలుపంచుకోండి? మీ రాజకీయ భవిష్యత్తు ఏమిటో.. తెలుగు ప్రజలే చూపిస్తారని .. మెగా అభిమానులు అంటున్నారు.
మీ అభిమానులమైన మేమే.. మీ పై రాళ్లు వేస్తుంటే.. మాకే సిగ్గుగా ఉంది. మెగా అభిమానులు మిమ్మల్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలనే ఆశపడ్డారు. కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల గతంలో జరగలేదు. కానీ వైఎస్ జగన్ , చంద్రబాబు చేసిన సాహసం మీరు గానీ చేసి ఉంటే.. ఈరోజు మీపై రాజకీయ విమర్శలు వచ్చి ఉండేవి కావని మెగా అభిమానులు అంటున్నారు. ‘‘పోరాడితే పోయేది వెధవ బానిస సంకెళ్లు తప్ప, పోయేది ఏమీలేదు ’’ అనే విషయం అందరికి తెలుసు. మీవెనుక .. ఆరడుగుల బుల్లెట్ ఉన్న విషయం మరిచిపోతున్నారు. సమైక్యాంద్రానే ఆయుధంగా చేసుకోని బరిలోకి దిగితే.. వచ్చే విజయదశమి నాటికి.. విజయం మీ వెనకే ఉంటుందని మెగా అభిమానులు అంటున్నారు.
గతంలో చేసిన తప్పులను మళ్లీ ఎవరు చెయ్యరు. ఈ సారి నిజాయితీగా సమైక్యాంద్ర కోసమే మా పోరాటం అంటూ రాజకీయ బరిలోకి దిగితే.. జాతీయ పార్టీలకు పంచెలు ఊడిపోవటం ఖాయమాని మెగా అభిమానులు బలంగా చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణకు ద్రోహిగా, సమైక్యాంద్రకు ఏమి చేయలేని నాయకుడిగా మీపై రాజకీయ విమర్శలు వింటే.. మాకే సిగ్గుగా ఉందని మెగా అభిమానులు అంటున్నారు. అభిమాన హీరో ఆదరించకపోయిన పర్వాలేదు గానీ, అభిమాన హీరో పై వస్తున్న విమర్శలు వింటేనే చాలా బాధగా ఉందని మెగా అభిమానులు అంటున్నారు. ఎమ్జీఆర్, ఎన్టీఆర్, జయలలిత లాంటి వారు కూడా సినీ నటులే. వీరందరు .. ప్రజల అభిమానంతోనే.. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికి వీరిని ప్రజలు ఆరాధిస్తున్నారు. మీరు ఆ స్థాయికి ఎదగాలని మెగా అభిమానులు కోరుచున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more