ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు చల్లబడ్డ తరువాత మరో రసవత్తరమైన వార్తతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో ఎక్కడ చూసిన అదే చర్చ. త్వరలో రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఉద్యమాల కన్నా ఈ రాజకీయ వార్తలే హీటెక్కనున్నాయి. త్వరలో సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసే వార్త బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం.
ఆయన త్వరలో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చి, తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి. సమాజం మీద, దేశం మీద ఎంతో భక్తి గౌరవం ఉన్న పవన్ సమాజానికి ఏదో చేయాలనే తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా చేసేందుకు తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి, దర్జాగా పదవిని అనుభవిస్తున్న ఆయనకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న పవన్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి, తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నాడని, దానికి సంబంధించిన సంప్రదింపులు కూడా బాలక్రిష్ణతో జరిగాయని, అదీకాకుండా రామోజీరావును కూడా ప్రత్యేకంగా కలిశాడనే వార్తలు వినిపించడమే కాకుండా, కొంత మంది ఔత్సాహిక నేతలు, కార్యకర్తలు తమ పార్టీ ఫ్లెక్సీల్లో పవన్‌కళ్యాణ్ ఫొటోల్ని పెట్టి హల్‌చల్ చేస్తున్నారు.కృష్ణా, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే ఈ తరహా ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.ఇవన్నింటి నేపథ్యంలో పవన్ నోటి నుండి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు.
మరోవైపు తన తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీని వీడను వీడను అంటూ చెప్పుకొస్తున్న బుడ్డోడు గత కొంత కాలంగా పార్టీకి, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ పవన్ తెలుగుదేశంలోకి ఎంట్రీ ఇస్తే జూనియర్ ఎన్టీయార్ జగన్ పార్టీకి జై కొట్టేందుకు సన్నధమవుతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైకాపాకు దగ్గరగా ఉంటూ, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్‌ను జగన్ కన్‌ఫార్మ్ చేయించుకుట్లు తెలుస్తుంది. దీంతో ఆ పార్టీలోకి జూనియర్ ఎంట్రీ కూడా ఖాయమని, గతంలో వైకాపా కార్యకర్తలు కూడా పలు జిల్లాల్లో అభిమానుల పేరుతో ఫెక్లీలను వేసి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అది ముందస్తు సంకేతమేనని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ టీడీపీలో చేరితే... ఎన్టీఆర్ జగన్ కి జై కొట్టడం ఖాయం అంటున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో వీరిద్దరు ఎలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చి రాజకీయాలను కుదిపిస్తారో చూడాలి అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more