అప్పుడే పుట్టిన పిండాన్ని పురిటిలోనే నలిపేసే తల్లిదండ్రులను చూశాం. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపే కోడుకులను, కూతురులన్ను చూశాం. పచ్చని పైర్ పై విషం చల్లే మనుషులను చూశాం. కానీ సమైక్యంద్ర కోసం సీమాంద్ర ప్రజలు, ఉద్యోగుల నుండి ఆవేశం, ఆక్రోషంతో పుట్టిన సమైక్యాంద్ర ఉద్యమం దెబ్బకు .. కేంద్రం లోని నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఫై-లిన్ తుపాన్ కంటే.. ఉద్యమం బలపడుతున్న సమయంలో.. సమైక్యాంద్ర ఉద్యమాన్ని నడిపిస్తున్ననాయకుడే.. తీరం దాటించటం వెనుక ఉన్న కారణం ఏమిటి? సమైక్యాంద్ర ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుడు పర్చురి అశోక్ బాబే.. సమైక్యాంద్ర ఉద్యమాన్ని తీరం దాటించాడా? అనే అనుమానం సీమాంద్ర ప్రజల్లో కలుగుతుంది.
ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న ఉద్యమ కెరటాలను.. అణివేసింది ఏవరు? ఇది తాత్కలిక విరమణ అని అశోక్ బాబు చెబుతున్నప్పటికి.. సీమాంద్ర ప్రజలు నమ్మటం లేదు. ఎపీ ఎన్జీవో ఉద్యోగులే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 75 రోజుల పాటు నిర్విరామంగా జరిగిన సమైక్యాంద్ర ఉద్యమం ఒక్కసారిగా నీరుగారిపోవటం పై సీమాంద్ర ప్రజలకు సరికొత్త అనుమానాలు రేకేత్తున్నాయాని ఉద్యోగ సంఘలు అంటున్నాయి. అసలు ఈ 75 రోజుల ఉద్యమం వల్ల ఏం సాధించాం.? అసలు నష్టపోయింది ఎవరు? ఈ 75రోజలు వల్ల లబ్ధిపొంది ఎవరు? అశోక్ బాబు ఉద్యమం పై వెనకడుగు వేయటం వెనక ఉన్న కారణం ఏమిటి? అసలు రాష్ట్ర మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో.. అశోక్ బాబు..ఏం చర్చలు జరిపారు?
సీఎం తో జరిగిన చర్చల రహస్యం ఏమిటి? సీఎం మాటలపై అశోక్ బాబు ఎందుకు ఆదారపడ్డారు? రాజకీయ పార్టీలను దూరంగా పెట్టిన అశోక్ బాబు.. ముఖ్యమంత్రితో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఈ ఇద్దరి మద్య నడిచిన ఒప్పందం ఏమిటి? అశోక్ బాబు కేంద్రానికి లొంగిపోయాడా? సిఎం కిరణ్, అశోక్ బాబు లు సమైక్యానికి వీరులుగా పేరుతెచ్చుకున్నారు. చివరి బంతి పడివరకు పోరాటమే అన్న వీరు.. చివరి బంతి పడకముందే ఫిచ్ నుండి బయటకు రావటం పై సీమాంద్ర ప్రజలకు, ఉద్యోగులకు అనేక అనుమానాలు రెకేత్తున్నాయి.
ఇప్పుడు అందరి ముందు నవ్వులపాలైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు అశోక్ బాబే లొంగిపోయాడా? లేక ఎవరైన లోబరుకున్నారు? సడన్ గా సమ్మెకు సెలవు చెప్పటంతో.. సీమాంద్ర ప్రజలు మండిపడుతున్నారు. ఇన్ని రోజుల నుండి సీమాంద్ర ప్రజలు సమ్మెచేస్తే... ? హఠత్తుగా సీఎంతో రాజకీయ చర్చలు జరిపి.. సమ్మెకు సెలవు అంటే.. ఇన్ని రోజులు నుండి సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల జీతాల పరిస్థితి ఏమిటి? సీమాంద్ర ప్రజల సంగతి ఏమిటి? ఒక్కసారి అశోక్ బాబు ఆలోచించాలని ఎపీ ఎన్జీవోలు ఉద్యోగులు కోరుతున్నారు.
రాష్ట్ర విభజన వల్ల సీమాంద్ర ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పిన రాజకీయ నాయకులు ఏమయ్యారు. అలాంటి నాయకులు చేసిన తప్పే సమైక్యాంద్ర ఉద్యమ నాయకుడు అశోక్ బాబు చేశారని.. సీమాంద్ర ప్రజలు అంటున్నారు. రాజకీయ నాయకులు మాటలతో మోసం చేస్తే,.. అశోక్ బాబు మాత్రం నమ్మించి .. సీమాంద్ర ప్రజల , ఉద్యోగుల గొంతు కోసేరాని సీమాంద్ర ఉద్యోగులు అంటున్నారు. ‘‘ గొర్రె ఎప్పుడు కసాయివాడినే నమ్ముతుందనే ’’ ముతక మాటలు గుర్తుకు వస్తున్నాయని .. సీమాంద్ర ప్రజలు అంటున్నారు. ఏమైన అశోక్ బాబు వేసిన ఒక్క వెనకడుగు వలన.. కోట్ల మంది జీవితాల్లో అంధకారం రాబోతుందనే నిజాన్ని సీమాంద్ర ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని.. రాజకీయ మేధావులు అంటున్నారు.
‘‘ ఆ అశోకుడు.. ప్రజల శ్రేయస్సుకోసం.. రొడ్డుపక్కన చెట్లు నాడిస్తే.. ఈ కలియుగపు అశోక్ బాబు మాత్రం.. సీమాంద్ర ప్రజలకు నిలబడటానికి నీడలేకుండా చేయట్యం పై సీమాంద్ర ప్రజలు మండిపడుతున్నారు. అసలు అశోక్ బాబులో ఉన్న నిజాయితీ ఏమైందనే విషయం పై సీమాంద్ర ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఏమైన సమైక్యాంద్ర ఉద్యమం చల్లబడిందనే విషయంపై ఢిల్లీ నుండి మైకు ద్వారా చెప్పిన దిగ్వీజయ్ సింగ్ కే , అసలు రహస్యం ఎరుక. ఆ రహస్యన్ని కూడా అతి త్వరలోనే ఢిగ్గీరాజే బయటపెడతాడని.. ఎపీ ఎన్జీవోల ఉద్యోగులు, సీమాంద్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more