‘‘అలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు సొమలింగం’’ అన్నవిధంగా కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చెబుతున్నారు. ఇప్పుడు ఈయన ద్రుష్టి సీమాంద్ర పై పడింది. అంటే 2014 ఎన్నికల తరువాత సర్వే సత్యనారాయణ గారు.. సీమాంద్ర కు గవర్నర్ గా వస్తానని .. మీడియా ముందు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒక పక్క రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతుందో.. లేక మద్యలోనే ఆగిపోతుందో అనే విషయం తెలియదు. ఎందుకంటే.. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి విభజన మాటల మూటలను గంగలో కలిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయం తెలిసిందే. అలాంటి కాంగ్రెస్ పార్టీ మాటలను మూటకట్టుకోని బ్రతుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే తిమ్మిని , బొమ్మిని చేయటం వారి మేథాస్సు. అందులో తలపండిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉన్న సీనియర్ నాయకులు అందరు ఏదో పదవి ఆశించింది ఉన్నవారే గానీ.. నిజాయితీగా.. ప్రజలకు సేవ చెయ్యాలనే మనస్సుకలిగి నేత ఒక్కరు లేరని విషయం ఇటీవల కాలంలోనే అర్థమైంది. తెలంగాణలో తెలివిగా నాయకులు కాంగ్రెస్ పార్టీ విడిచి పెట్టి టీఆర్ఎస్ పార్టీకిలో చేరుతున్న తరుణంలో మన సర్వే కలలు కనటం చాలా ఆశ్చర్యంగా ఉందని సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. రీసెంట్ గా అనంతపురం జిల్లా హిందూపురంలో తన బంధువుల ఇంటికి విచ్చేసిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లోపే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానుంది. ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రుల ఉద్యమాన్ని విరమించి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడితే బాగుంటుందని సూచించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీకి తమ డిమాండ్లు వినిపించాలని సలహా ఇచ్చారు. తాను గవర్నర్‌గా వచ్చినప్పడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారితో కలిసి అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. రాష్ట్ర విభజన జరగటం అనేది ఖాయమనే విషయాన్ని సీమాంద్ర ప్రజలకు తెలియజేయటానికి సర్వే సారు ఈ మంత్రం వాడినట్లు తెలుస్తోంది. సర్వే చేసిన వ్యాఖ్యలతో.. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. సర్వే సారు గారు.. మీరు చుట్టు చూపుగా వెళ్లిన మీరు.. రాజకీయలు మాట్లాడటం అనేది మీలో ఉన్న రాజకీయ పదవి ఆశను తెలియచేస్తోంది.
అసలే సమైక్యాంద్ర కోసం ఉద్యమం నడుస్తున్న సమయంలో మీ బందువులకు .. కొత్త తలనొప్పులు తేవటం అనేది అంత మంచిది కాదని తెలుగు ప్రజలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే.. అప్పుడు మీ పదవి గురించి సోనియా గాంధీ ఆలోచిస్తుంది. అంతేగానీ జరగాని విషయాన్ని జరుగుతుందని ప్రజలు ముందు చెప్పుకోని .. మీ పరువు మీరే తీసుకుంటున్నారనే విషయం తెలుసుకోవాలి. అసలు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరు సర్వే సారు అని సీమాంద్ర ప్రజలు అడుగుతున్నారు. ఆయన లో ప్రజలకు సేవ చేయాలనే సిద్దశుద్ది ఉంటే.. సీమాంద్ర కు గవర్నర్ కావాలనే ఆయన కోరిక. ఆయన వ్యక్తిగతమై మాత్రం ఆ కోరిక తీరాలని యాదగిరిగుట్ట నరసింహస్వామి వేడుకుందాం..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more