Ys jagan bribed sonia rs 1200 for bail

YS Jagan bribed Sonia Rs.1200 for Bail, TDP Bribe, YS Jagan Gali Muddu Krishnam Naidu, CM Ramesh, Sonia Gandhi,YSRCP, AP Politics, Congress party

TDP leaders CM Ramesh and Gali Muddukrishnam Naidu said Jagan has paid a bribe of Rs.12oo crore to Sonia Gandhi for bail release.

బెయిల్ కోసం జగన్ సోనియాకు 1200 కోట్లు ?

Posted: 09/28/2013 11:03 AM IST
Ys jagan bribed sonia rs 1200 for bail

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్రమాస్తులు సంపాదించాడనే ఆరోపణతో సీబీఐ వారు ఆస్తుల పై విచారణ జరిపి, ఆయన్ను అరెస్టు చేసి దాదాపు 16 నెలల పాటు చంచల్ గూడ జైలులో ఉంచారు. ఇటీవలే జగన్ బెయిల్ పై విడుదల అయ్యి స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నాడు. లక్షకోట్లు అక్రమంగా సంపాదించాడని ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మరి అంత సంపాదించిన జగన్ కి ఇంత తొందరగా ఎలా బెయిల్ వచ్చింది ? సీబీఐ ఉన్నట్లుండి మొత్తం పది కంపెనీలలో ఎనమిది కంపెనీల్లో క్విడ్ ప్రో కో జరగలేదని తేల్చేసింది. అదే టైంలో సుప్రీం కోర్టు విధించిన బెయిల్ పిటీషన్ గడువు ముగిసి పోవడం జగన్ బెయిల్ కి అప్లై చేయడం సీబీఐ కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ తతంగం అంతా చూస్తుంటే జగన్ బెయిల్ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో డీల్ కుదుర్చుకున్నారని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయకులు.

ఈ డీల్ కోసం జగన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి 1200 కోట్లు ఇచ్చారని అంటున్నారు తెదేపా నాయకులు గాలి ముద్దు క్రిష్ణమనాయుడు, సీఎం రమేష్. జగన్ బెయిల్ పై విడుదల అయిన రోజు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, కడప జిల్లాల్లో దాదాపు 40 మంది వ్యక్తులు 1200 కోట్లు విత్ డ్రా చేశారని, ఆ మొత్తాన్ని జగన్ సోనియా గాంధీకి ఇచ్చారా ? లేక ఆరోజు రథయాత్రలా సాగిన ర్యాలీకి ఖర్చు పెట్టారా ? అన్నది లెక్క చెప్పాలని వారు డిమాండ్ చేశారు. జగన్ బెయిల్ కన్నా ముందు విజయమ్మ ఢిల్లీ వెళ్లి అక్కడ రాహుల్ గాంధీతో కలిసి ఓ హోటల్లో చర్చలు జరిపి ఈ డీల్ కుదుర్చుకున్నారని, అంతక ముందు కూడా బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ పెద్ద అయిన అహ్మద్ పటేల్ ని చాలా సార్లు కలిశారని ఇదంతా డీల్ కోసమే అని వారు అంటున్నారు.

గత కొన్ని రోజుల నుండి మిన్నకుండా ఉన్న వైకాపా ఎమ్మెల్యేలు కూడా జగన్ విడుదల అయిన వెంటనే రాజీనామాల ఆమోదానికి పట్టుబట్టడం, పలు పత్రికలు వారి డీల్ వ్యవహారాన్ని బయట పెట్టడంతో వెనక్కి తగ్గారని ఆరోపించారు. వీరు డీల్ కుదుర్చుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆరోపించారని, ఆ 1200 కోట్ల పై ఆర్ బీఐ, సీబీఐ దర్యాప్తు జరపాలని వారు కోరుతున్నారు. వీరు ఆరోపణల్లో ఎంత నిజం ఉందో కానీ, జగన్ బెయిల్ డీల్ విలువ 1200 కోట్లా జనం నోరెళ్ల బెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more