Konda couples sad ys jagan odarpu

konda couples sad- ys jagan odarpu, Konda couple meets Jagan, Konda Surekha couple, jagan walk out in jail, ys jagan, ysrcp, congress party, Jagans Odarpu to Konda Couple, Konda Surekha, Konda Murali

konda couples sad- ys jagan odarpu, Konda couple meets Jagan,

కుమిలిపోతున్న కొండా-ఓదార్పులో జగన్

Posted: 09/25/2013 01:50 PM IST
Konda couples sad ys jagan odarpu

‘‘చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక ...తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక ’’ అనే విధంగా మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు ఇప్పుడు కుమిలిపోతున్నారు. నిన్నటి వరకు వైఎస్ కుటుంబాన్ని ప్రేమించి జంటగా తెలుగు ప్రజలందరికి తెలుసు. ఒకే ఒక్కనిర్ణయంతో.. కొండా దంపతులు వైఎస్ కుటుంబానికి దూరమైన విషయం తెలిసిందే. అయితే సమైక్యాంద్రకు జై కొట్టినందుకే జగన్ దూరమైన కొండా దంపతులు.. , చివరకు సమైక్యాంద్రకు మద్దతు పలికిన నాయకుడు వద్దకే చేరిన విషయం అందర్ని ఆశ్చర్యపరిచింది. జగన్ పార్టీలో ఉన్నప్పుడు కొండా దంపతుల కాంగ్రెస్ పార్టీ, సీఎం కిరణ్ పై ఘాటైన మాటల బాణాల ప్రయోగించి, కాంగ్రెస్ పరువు తీశారు. ఇప్పుడు అదే పార్టీలో.. చేరి జగన్ పై యుద్దం చెయ్యటానికి సిద్దమైన విషయం తెలిసిందే. అయితే రాజకీయ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. వాతవారంణంలో వచ్చే మార్పులను చెప్పొచ్చు గానీ, మారుతున్న రాజకీయ పరిస్థితుల గురించి చెప్పటం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ రోజు అలాగే జరిగింది. వైఎస్ జగన్ బెయిల్ పై బయటకు రావటంతో.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాజకీయ నాయుకుల తమ రాజకీయ భవిష్యతు పై జగన్ కలిసే పనిలో బిజీగా ఉన్నారు. నిన్నటి వరకు జగన్ కు సొంత అక్కగా, విజయమ్మకు కూతురుగా ఉన్న కొండా సురేఖ మాత్రం దూరంగా ఉండిపోయింది. అయితే ఈవిషయంపై కొండా దంపతుల అభిమానులు, కార్యకర్తలు.. కొండా కపుల్స్ పై మండిపడుతున్నారు. మీరు చేసిన తొందరపాటు చర్య వల్ల.. ఈరోజు ఏం జరిగిందో చూశారా అని కొండా దంపతులను కార్యకర్తలు నిలదీస్తున్నట్లు సమాచారం. ఒకవేళ జగన్ తో కలిసిపోదాం అంటే.. రీసెంట్ గా కాంగ్రెస్ కండువాను కప్పుకోవటం జరిగింది. దైర్యం చేసిన జగన్ వద్దకు వెళ్లి కలిసిన, జగన్ ఒకే అంటాడు.. కానీ ఆ పార్టీ నాయకులే ఛీ కొడతారు అనే భయం కొండా దంపతుల్లో ఉందని కొండా వర్గం అంటుంది. అయితే చివరిగా.. వైఎస్ షర్మిలతో రాయబారం పంపేందుకు కొండా దంపతులు సిద్దమైనట్లు కొండా కపుల్స్ అభిమానులు అంటున్నారు. అయితే జైలు నుండి బయటకు వచ్చిన జగన్ మాత్రం త్వరలో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త విని.. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఓదార్చటానికి .. ఓదార్పు యాత్ర చేస్తాడని వైఎఆర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇదే అదునుగా కొండా దంపతులు జగన్ కలిసిన ఆశ్చర్యంలేదని వైసీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more