Ys sharmila padayatra record effects on leaders jump

sharmila padayatra record effects, ys sharmila padayatra record effects, sharmila padayatra record effects on leaders jump, ys sharmila, ys jagan, ysr congress party, ysrcp, ysrcp leaders jump, chandrababu naidu padayatra, vastunna meekosam, kadapa mp ys jaganmohan reddy, ys sharmila creates world record, konda surekha, breaking news, ap politics, political news, andhra news

ys sharmila padayatra record effects on leaders jump

షర్మిల రికార్టులు-పార్టీలో నాయకులు పరార్

Posted: 07/29/2013 01:52 PM IST
Ys sharmila padayatra record effects on leaders jump

వస్తున్న మీకోసం అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు .. బాబు పాదయాత్రలో రికార్డులు చేసే కొద్ది .. టిడిపి నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు బాబు ఒక పక్క పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న ఆనందం, మరో పక్క పార్టీలోని సీనియర్ నాయకులు గోడ దూకటం లాంటి ఘటనలతో.. చంద్రబాబు నలిగిపోయాని తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ భవన్ ల్లో అప్పట్లో చెప్పుకున్నారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోకిందని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెల్లు షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర రాష్ట్రంలో మొదలుపెట్టి విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర వలన ఆమె భార్త అనిల్ బ్రదర్ పై ఎన్నో రాజకీయ విమర్శలు వినిపించాయి. అలాగే పార్టీలోని నాయకుల మద్య విబేధాలు శ్రుతిమించాయి. అయితే షర్మిల పాదయాత్రలో రికార్డులు స్రుష్టింస్తున్న కొద్ది పార్టీలో నాయకులు చెల్లచెదురైపోతున్నారు. తాజాగా షర్మిల మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటిందని ఆ పార్టీ మహిళ నాయకులు సంబంరాలు చేసుకుంటున్నారు. అదే పార్టీ మహిళ నాయకురాలు కొండా సురేఖ దంపతులు పార్టీ నుండి బయటకు వెళ్లటానికి సిద్దమైనట్లు గా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంత నాయకులంత వైఎస్ జగన్ పార్టీని విడేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఒక పక్క పార్టీ కోసం పాదయాత్ర చేస్తూ షర్మిల రికార్డులు పుట్టిస్తుంటే.. మరో పక్క పార్టీలోని నాయకులు వెళ్లిపోవటంతో ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నరని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. షర్మిల చేసిన రికార్డులు చూసి ఆనందం పడాలో .. లేక పార్టీలోని సీనియర్ నాయకులు వెళ్లిపోతున్నందుకు బాధపడాలో తెలియక ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పరుగులు తీస్తున్న నాయకులకు కళ్లెం వేసే నాయకుడు లేకపోవటంతో పార్టీ ఇరకాటంలో పడిందనే మాటలు పార్టీ కార్యకర్తలు మద్య వినిపిస్తున్నాయి. ఈ సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పరిష్కారిస్తుందో చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more