Ranabir katrina on secret journey caught

ranabir katrina affair, secret of ranbir katrina, katrina ranabir caught in spain, ajab prem ki gazab kahani, rajneethi

ranabir katrina on secret journey caught

పట్టుబడ్డ కత్రినా రణబీర్ లు

Posted: 07/11/2013 01:56 PM IST
Ranabir katrina on secret journey caught

అతిరహస్యం బట్టబయలు అన్నట్టు ఎవరికీ తెలియకుండా కత్రినా రణబీర్ కపూర్ లు ప్రేమ యాత్రకు స్పెయిన్ కి వెళ్తే అది కాస్తా బయటపడిపోయింది. 

సినిమాయే షో బిజినెస్.  అందులో ఆకర్షణలు వెదజల్లటమే వారి పనైనప్పడు, కెమేరా ముందు పాత్రనుబట్టి నటనగానే చేసినా, మనిషికి మనసనేది ఒకటుందిగా నటీనటులు దగ్గరై నటించే సందర్భాల్లో వారి లోపల కలిగే రసాయనికి ప్రతిచర్య వారిలో కోరికలను, పరస్పర ఇష్టాలను, స్నేహాలను కలగించటానికే ఎక్కువ అవకాశం ఉంది.  అలా సంబంధాలు కలుస్తుంటాయి, విడిపోతుంటాయి. 

కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ కి ప్రియురాలిగా పేరుతెచ్చుకున్నా, దరిమిలా 2009లో వచ్చిన అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ లో రణబీర్ తో కట్టిన జోడీతో ఆ తర్వాత రాజ్ నీతి లో కలిసి చెయ్యటంతో చూసేవారికే చూడముచ్చటైన జోడీ అని అనిపించినప్పుడు మరి వారిద్దరి మధ్యా ఎటువంటి స్నేహాతిశయం కలుగకుండా ఉంటుందా.  రణబీర్ కి దీపికాతో కూడా సన్నిహిత సంబంధమున్నట్లుగా వార్తలు వచ్చినా రణబీర్ మాత్రం కత్రినాకే హృదయాన్ని అర్పించినట్లుగా సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

ఇంతకీ స్పెయిన్ కి అంత రహస్యంగా ఎందుకు వెళ్ళారూ అంటే మధ్యలో వచ్చిన కొన్ని పొరపచ్చలను సరిచేసుకోవటానికట.  అర్జున్ కపూర్ ఇచ్చిన పార్టీలో రణబీర్ ఎక్కువగా తన స్నేహితులతోనే గడపటం సహించని కత్రినా కోపంగా ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోయిందట.  ఇలాంటి చిన్న చిన్న అలకలే దగ్గరవటానికి బాగా పనికివస్తాయని తెలుసుకాబట్టి, కొద్దిపాటి దూరాలు మరింత దగ్గరవటానికి సాయపడతాయి కాబట్టి ఇద్దరూ ఆ పనిలో స్పెయిన్ వెళ్ళారని తెలిసింది. అయితే ఎప్పుడో ఒకప్పుడు స్పెయిన్ లో అయినా బయటకు రాక తప్పదు కదా.  డేవిడ్ గ్వెట్టా కన్సర్ట్ కి వచ్చి అక్కడ కేమెరాకు చిక్కారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more