అధికారం కోసం కొన్ని పార్టీలు, ప్రత్యేక తెలంగాణ కోసం ఒక్క పార్టీ? ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాయి. 2014 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ నాయకులు దూకుడు పెంచుతున్నారు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు తమ ప్రణాళికలను బలంగా సిద్దం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మరళ అధికారంలోకి రావాలనే ప్రయత్నిస్తుంది. టిడిపి.. అధికారం కోసం ..అష్టకష్టాలు పడుతుంది. కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం, పార్టీ నాయకుడి మీద ఉన్న అవినీతి మరకలను తొలగించటానికి శతవిధాల ప్రయాత్నం చేస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీలో.. 2014లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని .. ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలనే పనిలో బిజీగా ఉన్నారు. 2014 లో మళ్లీ కాంగ్రెస్ను అధికారంలో తేవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ దూకుడు పెంచి, పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహన్ని నింపటానికి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకోక కొత్త పథకం పెట్టి ప్రజల్లో ఉన్న వైఎస్ఆర్ ముద్రను తొలగించి.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముద్ర పడేలా కొత్త కొత్త పథకాలతో ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. మాత్రం నేను ‘‘మారిన మనిషి ’’ని అంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. పాదయాత్ర పేరుతో రాష్ట్రంలో 17 జిల్లాలు తిరిగి, అలసిపోయి.. ఇంట్లో రేస్ట్ తీసుకుంటున్నారు. పాదయాత్రలో బాబు మేము అధికారంలో వస్తే.. మీకు మంచి చేస్తానని, వరాల వర్షం కురిపించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసాను.. తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నాయుకుడిగా చేసాను. నాకు అపారమైన అనుభవం ఉందని చెప్పుకుంటూ..ప్లీజ్..ఓటు వేయండని.. చెప్పులు కుట్టే చంద్రయ్య దగ్గర నుండి .. సిల్వర్ చెప్పులు ప్రేమతో ఇచ్చిన చెంచయ్య వరకు అందరిని అడిగి.. పాదయాత్ర ముగించారు. ఇక ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ . ఇక ఈ పార్టీ అధినాయకుడు .. అక్రమాస్తుల కేసులో కొన్ని నెలల నుండి జైల్లో ఉంటే బయట రాజకీయ నడుపుతున్నారు. కొత్త పార్టీ కాబట్టి., అందులో ఆర్థికంలో బలమైన పార్టీగా గుర్తించిన నాయకులు.. ఈ పార్టీలోకి మిగిలిన రాజకీయ పార్టీల నాయకలు వలసలు వస్తున్నారు. అసలే అధినాయకుడు జైల్లో ఉన్నప్పటికి.. పార్టీ బాధ్యతలు.. ఆపార్టీ ప్రధాన గౌరవాద్యక్షరాలు పై పడింది. పార్టీ కోసం తల్లి కూతుళ్లు ఇద్దరు కష్టపడుతున్నారు. ఎలాంటి విమర్శలు వచ్చిన వాటిని దీటుగా ఎదురుకుంటూ ముందుకు పొతున్న వీరవనితలుగా రాష్ట్ర మహిళలు గుర్తించారని. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
ఇక ప్రత్యేక తెలంగాణ 12 సంవత్సరాల క్రితం 2001లో అతికొద్ది మందితో పార్టీ స్థాపించి.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల కేసిఆర్. 2009 వరకు టిఆర్ఎస్ పార్టీ అంటే అతి కొద్దిమందికే తెలిసింది. ఇప్పుడు తెలంగాణ గల్లీ నుండి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ ఉందని ..ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుందని జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ పవర్ ఏమిటో చూపించారు. పన్నెండేళ్లుగా ఉద్యమం కొత్తపుంతలు తొక్కింది. 1969లో ఉద్యమం ఉవ్వెత్తున లేచి కిందపడిపోయింది. ఈసారి పదునైన వ్యూహాలతో ఓర్పుతో ముందుకు సాగుతుందని కేసిఆర్ అంటున్నారు. జాతీయ స్థాయిలో 32పార్టీలను ఒప్పించాం.. తెలంగాణకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాం. ఇప్పుడు జాప్యం జరుగుతున్నప్పటికీ తెలంగాణ ఏర్పడి తీరుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కు పన్నెండేళ్ల క్రితం ప్రారంభమై టీఆర్ఎస్ పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకుంది. అనేక ఒడుదుడుకులు, ఆటుపోట్లతో నిలదొక్కుకొని తెలంగాణ ప్రజల పార్టీగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తోంది. తెలుగు నేలపై తెలుగుదేశం తర్వాత ఎక్కువ కాలం క్రియాశీల రాజకీయల్లో మనుగడ సాగించిన ప్రాంతీయ పార్టీగా రికార్డులకెక్కిన టిఆర్ఎస్ త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో విశ్వరూపం చూపిస్తామని కేసిఆర్ చెబుతున్నారు.
తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీలకు మనుగడ ఉండదని , తెలంగాణ పార్టీగా తెరాసనే ప్రజలు ఆదరిస్తారని కేసిఆర్ చెబుతున్నారు. ఆంద్ర నాయకులకు .. టిఆర్ఎస్ పవర్ ఏమిటో అప్పుడు చూపిస్తామని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మా విశ్వరూపం చూసి ఆంధ్రనాయకులు పారిపోవటం ఖాయమని .టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు పార్టీల మధ్య పోరు జరుగుతుంది. 2014లో ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రజలకు విశ్వరూపం చూపిస్తారో.. లేక ప్రజలే రాజకీయ పార్టీలకు విశ్వరూపం చూపిస్తారో..చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more