ఇటీవల కాలంలో కలెక్షన్ కింగ్ కాస్త ఆర్థికంగా దెబ్బతిన్న విషయం తెలిసింది. కొడుకులు , కూతురు చేసిన సినీ ప్రయోగాలతో కలెక్షన్ నిల్ గా మారిపోయాడు నటుడు డాక్టర్ మోహన్ బాబు. మరిచిపోయిన రాజకీయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చుకుంటున్నారు. గతంలో ఎన్టీఆర్ సమయంలో మోహన్ బాబు ఎంపీగా ప్రజా సేవా చేసిన విషయం తెలిసిందే. కానీ ఇటీవల రాజకీయల్లోకి వస్తున్నాను అంటూ మీడియా మందు ప్రకటన చేయటం జరిగింది. అయితే ఏ రాజకీయ పార్టీలో చెరతాడో చెప్పలేదు. కలెక్షన్ కింగ్ ఏ రాజకీయ జెండా కిందకు వెళ్లతాడని రాజకీయ నాయకులు ఎదురుచూస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుల అంచాలన ప్రకారం నటుడు మోహన్ బాబు మాత్రం తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడనే సంకేతకాలు బలంగా వినిపిస్తున్నాయి. కమ్మ వర్గానికి చెందిన మోహన్ బాబు .. ఈసారి ఆ వర్గంలోకి వైపు వెళ్లటం లేదని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఈ సారి బందు ప్రీతీ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే కలెక్షన్ నిల్ అయిన మోహన్ బాబు.. చంద్రబాబు పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల తన కుటుంబలోకి కోడలుగా వచ్చిన రెడ్డి వర్గంతో తమ బంధాన్ని బలంగా పెంచుకొని , ఆర్థికంగా బలపడదామనే ఆలోచనల్లో మోహన్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
మోహన్ బాబు గతంలో తెలుగుదేశం పక్షాన ఎమ్.పిగా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబుతో వచ్చిన విబేధాల వల్ల ఆయన పార్టీకి దూరం అయ్యారు.కొంతకాలం క్రితం మోహన్ బాబును మళ్లీ టిడిపి వైపు తీసుకురావాలని కొందరు ఆలోచన చేశారు కాని అవి కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన ప్రస్తుత పరిస్థితిలో చేయకపోవచ్చు.పైగా అక్కడ మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఆయనతో అంత సఖ్యత లేదు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి తమ్ముడి కుమార్తెతో మోహన్ బాబు కుమారుడు విష్ణుతో వివాహం జరిగింది. దాంతో ఆ రెండు కుటుంబాల మధ్య బందుత్వం కూడా ఏర్పడింది.
వ్యక్తిగత కారణాలే కాకుండా , రాజకీయ కారణాలతో కూడా మోహన్ బాబు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని అంటున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు చెందిన ఒక ప్రముఖుడు కూడా ఇదే విషయం చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు మోహన్ బాబు పార్టీలోకి వస్తాడనే ఆలోచనలకు పులుస్టాఫ్ పెట్టినట్లు రాజకీయ వర్గాల సమాచారం. కలెక్షన్ నిల్ గా ఉన్న కలెక్షన్ కింగ్ మళ్లీ పుంజుకోవాలంటే.. ఇదే సరైన రూటు అని మోహన్ బాబు కుటుంబ సభ్యులు అంటున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో బిజినెస్ మైండ్ కలిసిన ప్రముఖ నటుడు వైఎస్ జగన్ అనేక సార్లు జైల్లో కలిసి మంతనాలు జరిపినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more