తెలుగు సినిమా పరిశ్రమ అంటే కేవలం హీరోలు హీరోయిన్లు దర్శకులే కాదు, సినీ పరిశ్రమ ని నడిపించేది నిర్మాతలు, పంపిణీ దారులు కూడా ... ఒక విధం గా దర్శకుని ఆలోచనకు కార్య రూపం ఇవ్వాలన్న ఒక హీరో ని నమ్మి అత్యంత ఎక్కువ బడ్జెట్ తో సినిమా తీయాలన్న, ఇలా ఎలాంటి రిస్కులు తీసుకోవాలన్న అది నిర్మాతకు మాత్రమె సాధ్యం ... సినిమా హిట్ సాధిస్తే హీరో దగ్గరి నుండి సంగీత దర్శకుడి వరకు అందరు లాభపడతారు ... కాని సినిమా ఆడకపోతే మాత్రం వీరందరికన్నా నష్టపోయేది సదరు నిర్మాత , పంపినీదారుడు మాత్రమే ... ఇంత రిస్క్ ఉన్నా కూడా, కొత్త కొత్త నిర్మాతలు వెలుగు లోకి వస్తూనే ఉన్నారు ... ఇప్పుడు చిత్ర పరిశ్రమ లో స్టార్ నిర్మాతలు గా చలామణీ అవుతున్న నిర్మాతలకు సమానంగా అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో సినిమాలు తీసి సవాల్ విసురుతున్నారు ...
స్టార్ హీరో ల తో సినిమాలు తీయాలంటే , మొన్న మొన్నటి వరకు అశ్వినీ దత్, ఇప్పుడు కూడా అల్లు అరవింద్, దిల్ రాజు, బెల్లంకొండ సురేష్ ఇలా కొద్ది మంది నిర్మాతలే మనకు తెలుసు ... వీరి వీరి స్తాయి లో స్టార్ హీరోల తో, భారీ బడ్జెట్ ను వేచ్చించి సినిమాలు తీయడం లో దిట్టలు ... అయితే ఇప్పుడు మరో పేరు, గత 3 సంవత్సరాలు గా వినపడుతోంది ... అతడే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి నిర్మాత గా మారిన బండ్ల గణేష్ ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ తో, ఆయనను హీరో గా 'పెట్టి 'తీన్ మార్' చిత్రం ద్వారా నిర్మాణ రంగం లో ప్రవేశించాడు గణేష్ ... ఈ సినిమా ఆశించినంత విజయం సాధించాక పోయినా, గణేష్ మాలి ప్రయత్నం 'గబ్బర్ సింగ్' మాత్రం బాక్స్ ఆఫీసు రికార్డ్లను బద్దలు కొట్టింది ... ఇక ఏ మాత్రం ఆగని గణేష్ ప్రస్తుతం N.T.R. తో 40 కోట్లకు పైగా వేచ్చింది 'బాద్షా' తీస్తున్నాడు ... అల్లు అర్జున్ తో 'ఇద్దరంమాయిలతో' అనే ఇంకో భారీ బడ్జెట్ సినిమా ను కూడా నిర్మిస్తున్నాడు ...
గణేష్ స్పీడు చూస్తుంటే నిర్మాతగా సదరు పేరు మోసిన నిర్మాతలందరినీ దాటేసి నంబ వన్ గా నిలేచేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more