మన తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర కధానాయికలకు కొదవ లేదు... అలాగే, ఒక సినిమా తో కనుమరుగు అయిపోయిన భామలూ ఉన్నారు. ఇంకొంతమంది హీరోయిన్లు, అటు స్టార్ హీరోల సరసన నటించి, మొదటి సినిమాతోనే స్టార్డం సంపాదిస్తారు అనుకుంటే, ఈ సినిమాల జయాపజయాలతో సంబంధంలేకుండా మళ్ళీ కనిపించకుండా పోయిన వారూ ఉన్నారు. ఈ మూడవ కోవకు చెందిన హీరోయిన్, కరిష్మా కొటాక్... మెగా స్టార్ చిరంజీవి సరసన, 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రంలో నటించిన ఈ అమ్మడు, అటు నటన పరంగా, ఇటు అంద చందాల పరంగా, మంచి మార్కులని సంపాదించుకోకలేకపోయింది... చిత్రానికే పెద్ద మినస్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత, విడుదలకి నోచుకోని ఒకటో రెండో చిత్రాలలో నటించింది... కొన్ని సంవత్సరాల తరువాత, ఈ మధ్య కాలం లో టెలివిషన్ చరిత్రలోనే తిరుగులేని షోగా విజయం సాధిస్తున్న 'బిగ్ బాస్' లో మెరిసింది... మరి ఈ షో హీరో సల్మాన్ ఖాన్ అండ దండలో, లేక దర్శకుడికి తాను అనుకున్న పాత్రలో ఈ అమ్మడు సరిగ్గా సరిపోతుంది అని అనిపించడం వల్లనో, సల్మాన్ త్వరలో నటించాబోయే చిత్రం 'రాధే' లో కరిష్మా హీరోయిన్ గా నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ చిత్రం, మెగా స్టార్ నటించిన 'స్టాలిన్' చిత్రం ఆధారంగా రూపొందుతోంది. సల్మాన్ ఇంకో తమ్ముడు సోహైల్ ఖాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. త్వరలో, ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది...ఏమైనా, ఇన్ని నాళ్ళు మంచి అవకాసం కోసం ఎదురుచూస్తున్న కరిష్మాకు, అదృష్టం తన్నుకుంటూ వచ్చింది అనే చెప్పాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more