మంచు లక్ష్మీ ప్రసన్న కొత్త రాజకీయానికి తెరలేపారు. లక్ష్మీ ప్రసన్న కాస్తా లేటుగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన తండ్రి డాక్టర్ మోహన్ బాబు తగిన కూతురుగా పేరుతెచ్చుకుంది. లక్ష్మీ ప్రసన్న నిర్మాత కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే పెద్ద దర్శకులు రాంగోపాల్ వర్మ, మణిరత్నం వంటి దర్శకుల సినిమాల్లో నటిస్తూ తన రేంజ్ పెంచుకుంది. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న నటిగా చాలా బిజీగా ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఒక టీవీ షోలు కూడా చేస్తూ మరో వైపు సినిమాల్లో నటి నటిస్తూ, మంచు లక్ష్మీ తన ఇమేజ్ ను భారీగా పెంచుకుంది. అయితే ఇటీవల ఆమె పై కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. లక్ష్మీ త్వరలో రాజకీయ ప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మోహన్ బాబు చంచల్ గూడ జైల్లో ఉన్న వైఎస్ జగన్ రెడ్డి కలిసి, లక్ష్మీ విషయం చెప్పినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. 2014 లో జరిగే ఎన్నికల్లో మంచు లక్ష్మీకి టికెట్ తెప్పించుకునే దిశగా పావులు మోహన్ బాబు కదుపుతున్నారని ఫిలింనగర్ ప్రజలు అనుకుంటున్నారు. లక్ష్మీ కూడా రాజకీయ ప్రవేశం చేయటానికి సిద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. తను సొంత సంపాదించుకున్న మహిళల ఇమేజ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని లక్ష్మీ తెగ ప్రయత్నం చేస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. వచ్చే ఎన్నికల్లో తండ్రి కూతుళ్లు ఇద్దరూ రాజకీయ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయిని రాజకీయ పండితులు అంటున్నారు.
అయితే ముందు మోహన్ బాబు చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తండ్రి కూతుళ్లు ఇద్దరు టీడీపీ నుండి పోటీ చేస్తే బాగుంటుందని మొదట వారు భావించారట. కానీ దీనికి చంద్రబాబు ఒప్పుకోలేదని, టీడీపీ చాలా మంది నాయకులు ఉన్నారని బాబు చెప్పినట్లు మోహన్ బాబు తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. అందుకే వైఎస్ జగన్ పార్టీలో తండ్రి కూతుళ్లు ఇద్దరూ రాజకీయ ప్రవేశం చేస్తారనే విషయం ఫిలింనగర్లో చకర్లు కొడుతుంది. లక్ష్మీ ఎఫెక్ట్ నటి రోజా పై పడుతుందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు. లక్ష్మీకి విషయం తెలుసుకున్న రోజా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందట. ఈ విషయం పై వైఎస్ విజయమ్మతో చర్చలు జరిపినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. అయితే విజయమ్మ మాత్రం జగన్ ఎలా చెబితే అలా జరుగుతుందని రోజాకు చెప్పినట్లు సమాచారం. పార్టీ లో మాత్రం రోజాకు టికెట్ దొరకటం చాలా కష్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెవులు కోరుక్కుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more