పదవి కోసమో, పవర్ కోసమో, ప్రజల కోసమో గానీ మొత్తం మీద బాబు వస్తున్నా మీకోసం అంటు పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ నాయకులకు పాదయాత్ర బాగా కలిసి వచ్చింది. అంటే పార్టీ నుండి పారిపోయే నాయకులకు మంచి అవకాశంగా కనిపిస్తుంది. అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో తిరుగుతుంటే.. పార్టీలోని సీనియర్ నాయకులు మాత్రం ‘‘మా కోసం వెళ్ళుతున్నం’’ అని పార్టీ నుండి జంప్ అవుతున్నారు. పార్టీ నుండి జంప్ చేసే నాయకులు కూడా పవర్ కోసమో, లేక పదవి కోసమో, ప్రజల కోసమో, ఖజనా కోసమో తెలియాదు గానీ టీడీపీని వదిలి జగన్ పార్టీలో వెళ్తున్నారు. మొన్న ఇద్దరు వెళితే.. ఈ రోజు పార్టీ సినియార్ నేత ఉమా రెడ్డి జగన్ పార్టీ లో చేరిపోయాడు. అసలు ములుగుతుంటే.. దాని మీద ఒక తాటిపండు పడినట్లు గా టీడీపీ పరిస్థితి తయారైంది. గత కొన్ని రోజులుగా పార్టీలో కలకలం రేగింది. పార్టీ నుండి నాయకులు వెళ్ళిపోతున్నారు. పార్టీ ఉన్న నాయకుల్లో కొత్త దడ మొదలైంది. లోక్ సభకు ముందస్తు ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు అన్నీ పార్టీ లు గెలుపు గుర్రల కోసం వేట మొదలుపెట్టింది.
ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రల కోసం వేట సాగించి ..గుర్రలను ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్నాట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. ఇలా సీనియర్ నాయకులు వలసలు వెళ్లిపోవటంతో చంద్రబాబు కు భయం పట్టుకుంది. లోక్ సభ ఎన్నికలు వస్తే తమ పార్టీ పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలో బాబు ఉన్నడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బాబు ఎంపీ స్థానాలకు పోటీ చేసే నాయకులపై మనసు పెట్టలేదనే వాదన వినిపిస్తుంది. లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరగడం, ఆ ఫలితాలు చేదు అణుభవాన్ని మిగుల్చుతుందేమోనని చంద్రబాబు భయపడుతున్నాడట. బాబు బాడీ పాదయాత్రలో పాల్గొన్న ఆయన మైండ్ మొత్తం పార్టీ నాయకుల పై ఉందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more