రాష్ట్రంలో ప్రస్తుతం కిరణ్, బొత్సలను కామెంట్ చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కిషోర్ చంద్రదేవ్ లేఖ కలకలం స్రుష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈలేఖ విషయంలో కొత్త ట్విస్ట్ బయటకి వచ్చింది. ఎంతో సీక్రెట్ గా అధిష్టానానికి చేరవేసిన ఈలేఖ ఎలా లీకయ్యిందని ఆరా తీస్తే కొత్త కోణం వెలుగు చూసిందట. ఈ లేఖ లీకు వెనుక కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ టీమ్ ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వర్గానికి చెందిన కొందరు కిరణ్, బొత్సల పై కన్నేసి, వారి పదవికి ఎసరు పెట్టేపనిలో భాగంగానే ఈ లేఖను లీకు చేసినట్లు వార్తలు. ఎప్పుడో రాసిన ఈ లేఖను ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం ఏముందని, వీరిద్దరి తీరు, వ్యవహార శైలి నచ్చకనే రాహుల్ టీం బయటపెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి జనంలో మంచి మార్కులను రాబట్టడంలో అటు బొత్స, ఇటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమవుతున్నారన్న భావన అధిష్టానంలో వ్యక్తమయినట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే 2014 దాకా సాగితే పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే ప్రమాదం ఉందన్న సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. పైగా కిరణ్ కి , బొత్సకు మధ్య విభేదాలు కూడా ఉండటంతో, వీరి కుమ్ములాటకే టైం సరిపోతుంది. ఇక రాష్ట్రాన్ని ఎక్కడ పాలిస్తారు అనే విషయాన్ని పలువురు సీనియర్ కాంగేయులు అధిష్టానం చెవిలో చెప్పినట్లు తెలుస్తోంది. వీటన్నిటి నేపధ్యంలో కిషోర్ చంద్రదేవ్ లేఖను లీక్ చేయడం ద్వారా ఇద్దరికీ పొమ్మనకుండా పొగ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు . మొత్తానికి యువరాజు టీం లీక్ చేయడం చూస్తుంటే.... రాహుల్ ఓ ప్లాన్ ప్రకారమే చేయిస్తున్నారని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more