ప్రస్తుత బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను అధ్యక్ష పదవి నుండి తప్పించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో కొత్త అధ్యక్షుడిగా ఎవర్ని నియమించాలనే దాని పై తర్జన భర్జనలు పడుతుంది ఆర్ఎస్ఎస్. అయితే రానున్న ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని, ఆ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే నాయకుడ్ని నియమించాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో అధ్యక్షుడిగా పని చేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడుకి మళ్లీ పార్టీ పగ్గాలను అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అనేక ఎన్నికల నిర్వహణలో ఆరితేరిన సీనియర్ నేత బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాలు. గతంలో బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న వెంకయ్య పార్టీకి, ప్రభుత్వానికి, సంఘ్ పరివార్‌కూ మధ్య సమన్వయాన్ని సమర్థంగా నిర్వహించారని, పార్టీ కార్యక్రమాలను ఆరోగ్యకరంగా నిర్వహించారని, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణను చక్కగా చేపట్టారని ఆర్ఎస్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ మూడో వారంలో జరిగే బీజేపీ జాతీయ మండలి సమావేశంలో గడ్కరీ తనంతట తాను తప్పుకునేందుకు అవకాశం కల్పిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈలోపులోనే, భావి నాయకత్వంపై పార్టీ నేతలు, సంఘ్ పెద్దలు ఒక నిర్ణయానికి రావచ్చునని, ఇప్పటికే ఈ దిశగా అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్, శాంతకుమార్ పేర్లు పరిగణనలోకి వచ్చినా, సంస్థాపరంగా నిర్వహణ సామర్థ్యం కలిగిన వెంకయ్య వంటి నేత ప్రస్తుతం అవసరమని బీజేపీ, సంఘ్ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. గత నాలుగు దశాబ్దాలుగా సంఘ్‌తో సంబంధాలున్న వెంకయ్య ఇటు పార్టీకి, అటు సంఘ్‌కు విధేయంగా ఉంటారని, రెండింటికీ వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడూ లేవని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీ కోరినప్పుడు కేంద్రంలో కేబినెట్ పదవి సైతం వదులుకుని 2002-04 మధ్య పార్టీ అ«ధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వెంకయ్య అధ్యక్షుడుగా ఉన్నంతకాలం ఎలాంటి వివాదాలు తలెత్తలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మంచి అనుభవం, సామార్థ్యం ఉన్న వెంకయ్యను పార్టీ అధ్యక్షుడిగా చేస్తే అన్ని విధాల లాభమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి వెంకయ్యను మళ్లీ అధ్యక్ష పదవి వరిస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more