ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సినిమా విడుదల అయినా అది వివాదాలకు దారి తీస్తుంది. మరి దర్శకులు పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారో, లేక కావాలనే వివాదాలు రేపుతున్నారో కానీ మొత్తానికి ఇప్పడు రాష్ట్రంలో రాజకీయాల కన్నా సినిమాల వివాదాలే హైలెట్ అవుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో మరో సినిమా కూడా వివాదాలకు ఆజ్యం పోయడానికి రెఢీ అవుతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా తెరంగ్రేటం చేస్తూ నటిస్తున్నా అల్లు శిరీష్ చిత్రం గౌరవం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని ఇటీవలే విడుదల చేశారు. రొటీన్ కి భిన్నంగా రూపొందించిన ఈ సినిమా పొస్టర్ అందరి ప్రశంసలు అందుకుంటుంది. అదే సమయంలో వివాదాలకు దారి తీసే విధంగా ఉందంటున్నారు.
ఈ పోస్టర్ మధ్యలో బ్లూ కలర్ కవర్ తో కప్పిన విగ్రహం. మరి ఎవరి విగ్రహం అనే సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ వెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పోస్టర్ లో కూడా ఉన్నది వైయస్సార్ విగ్రహమే అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. అసలు మెగా ఫ్యామిలీకి వైయస్సార్ అన్నా, జగన్ పార్టీ అన్నా అసలు పడదు. అందుకే ఈ సినిమాలో ఆయనకు సంబంధించిన నేపథ్యం ఈ సినిమాలో ఉంటుందని అనుకుంటున్నారు. ఒకవేళ అలాంటిదే గనుక ఉంటే ఈ సినిమా కూడా వివాదాల పాలవ్వడం ఖాయం అంటున్నారు. మరి వీరనుకుంటున్నట్లు అది ఎవరి విగ్రహమో తేలాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more