మెదక్ జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పక్కన ఇద్దరు ఐటమ్ నాయకులు చేరి ఇందిరమ్మ బాట రచ్చ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. సీఎం సాక్షిగా ఆ ఇద్దరు నాయకుల నాలుకల మీద బూతు పదాలు నాట్యం చేసినట్లు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. వారు ఎవరు కాదు .. ఆ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. మెదక్ జిల్లా దుబ్బాకలో జరుగుతున్న ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన వెంటనే ఈ ఇద్దరు మద్య తీవ్రమైన వ్యాఖ్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ఎమ్మెల్సీ షారుఖా హుస్సేన్ పై తీవ్రవైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ వాడు ఇక్కడేంది మాట్లాడేది.. సిద్దిపేట గురించి ఇక్కడ మాట్లాడుతాడా’..? వాడు జేబులు కొట్టేటోడు అంటూ విమర్శలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ మాటలు విన్న షారూఖ్ హూస్సెన్ తీవ్రంగా స్పందించారు. ‘నీవేంది ..నేను దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని 30 ఏళ్లుగా కాపాడుకుంటు వస్తున్నా.. ఇక్కడి పార్టీ కార్యకర్తలు, ప్రజలతో నాకున్న బంధం నీకెక్కడిది అని ప్రశ్నించారు. ఈఇద్దరి మద్య పోటా పోటీ మాట యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. నీమాదిరి నేను టీడీపీలో నుంచి దుంకి రాలేదు. నువ్వే పార్టీ ఫణిరాయించేటోడివి అంటూ ముత్యం రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరి ఏకవచనం వరకు వెళ్లడంతో రంగంలోకి పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సముదాయించారు. ఈ ఇద్దరు సీఎం కిరణ్ అటు ఒకరు ఇటు ఒకరు ఉండి ఐటమ్ గాళ్ల మాదిరి తిట్టుకోవటం చూసిన కాంగ్రెస్ నాయకులకే నవ్వొచ్చిందని మీడియా వారు అంటున్నారు. ఇందిరమ్మ బాటు సీఎం కిరణ్ పరువు తీసిన నాయకులుగా ప్రజలు చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more