ఇటీవల హైదరాబాద్ లో ఇండియా మాజీ క్రికెటర్ గంగూలీ చేతుల మీదగా ఒన్ కార్టు ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు. ఒన్ కార్టు అంటే ఏమిటో తెలియాని రోజుల్లో .. భారీ ఎత్తున ఒన్ కార్డును హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇప్పడు అంతా కార్డుల ప్రపంచం కాబట్టి ఈ ఒన్ కార్డు గురించి అందరికి స్పీడ్ ఎస్ఎంఎస్ లా చేరింది. అసలు ఒన్ కార్డు అంటే ఏమిటి? పది కార్డుల మొతబరువును తగ్గించి సింగిల్ కార్డుగా చూపించేదే ఒన్ కార్డు. అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఐడీ కార్డులు, లైసెన్స్ , పాన్ కార్డు ఇలా మీ పర్సు కార్డులతో నిండిపోకుండా ఉండేలా చేసేదే ఒన్ కార్డు. అన్నీ కార్డులకు బదులు ఈ ఒక్క కార్డు ఉంటే చాలు? అన్నీ పనులు జరిగిపోతాయి. దీనినే వన్ నేషన్ కార్డు అని ముద్దుగా పిలుస్తారు. అయితే ఇప్పుడు ఈ కార్డు వల్ల కొంత మంది కొంపలు మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కార్డు తీసుకున్న వారి ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం గోవిందా అయ్యిందట. ఈ భారీ స్కామ్ సాయికుమార్ డైరెక్షన్ లో జరిగినట్లు తెలుస్తోంది. సాయి కుమార్ అంటే నటుడు సాయి కుమార్ కాదండోయ్. ఈయన చందూరి వెంకట కోటి సాయికుమార్. ఈ మాయగాడుతో పాటు కొండాపూర్ కు చెందిన నండూరి వెంకటరామన్, బ్యాంక్ డిపాజిట్ లకు మధ్యవర్తిగా వ్యవహరించే బొండాడ కేశవురావు , విజయా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నవీన్ సాగర్ అలాంటి మహ గేటుగాళ్లు ఈ వన్ కార్డు స్కామ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 16 బినామీ కంపెనీలకు కొన్ని కోట్లు రూపాయాలు మళ్లించినట్లు తెలుస్తోంది. సుమారుగా 55.47 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు. అయితే ఈ విషయం గురించి ఈ సంస్థ ఎండీకి తెలియాదని చెబుతున్నారు. ఎండీ రిజ్వీ పాత్రపైనా సీఐడీ ఆరా తీస్తుంది. ఈ వ్యవహారం పది నెలలుగా జరుగుతున్న ఎండీ రిజ్వీ గుర్తించకపోవడం సీఐడీ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం వ్యవహారం ఆయనకు తెలిసే జరిగిందా? అనే కోణంలో ఆరాతీస్తున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కార్పొరేషన్ తో పాటు విజయా బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై కూడా సమాచారం సీఐడీ వారు సేకరిస్తున్నారు. సాయి కుమార్ పై కూడా సీఐడీ ఒక కన్ను వేసింది. వన్ కార్డ్ వన్ నేషన్ అనే సంస్థ కార్డును ప్రజలకు పరిచయం చేసింది సాయి కుమార్. అధికారులు దీనిపైనా ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more