రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి చాలా గర్వం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంటున్నాడు. ఆయన కొంచెం గర్వం తగ్గించుకోవాలని ఆయన ఉచిత సలహా ఇవ్వటం జరిగిందట. అదీ కూడా సీఎం పుట్టిన రోజు నాడే ఆ సినీయర్ నాయకుడు తన నోటీ దులతీర్చుకున్నాడని కాంగ్రెస్ నాయకులు చెవులు కోర్కుకుంటున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరా? రాష్ట్రంలో సిబిఐ వారికి మంచి పని అప్పజేప్పిన వ్యక్తి. ఆయనే మాజీ మంత్రి పి. శంకర్ రావు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో కోవర్టులు పనిచేస్తున్నారని మాజీమంత్రి డా పి.శంకర్‌రావు అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి గుర్తింపు లేదని, ఇప్పటికైనా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర, జిల్లా శాఖలకు 2004 ముందు ఏర్పాటు చేసిన కార్యవర్గాలే నేటికీ కొనసాగుతున్నాయని, కొత్తగా కార్యవర్గాలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధగా ఉందని ఆయన అంటున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన శంకర్‌రావు సిఎంకు గర్వం ఉందని, ఆయన గర్వం వీడితే పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అదే ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎవరు ఏది చెప్పినా తనకు తెలుసు ( ఐ నో) అంటారని, ఆ పదాన్ని తన నిఘంటువు నుంచి తొలగించి అందరూ చెప్పింది వింటే బాగుంటుందని శంకర్‌రావు గుర్తుచేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. శంకరావు మాటలకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు నవ్వుకుంటున్నారట. మరికొందరైతే తలపట్టుకుంటున్నారట. పండగ రోజు కూడా పాత మొగుడే అంటే ఇదే కాబోలని మీడియా వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more