మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబానికి టైమ్ కలిసి రావటంలేదేమో? ఆయన అన్ని దెబ్బలే తగులుతున్నాయి. జయలలిత ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గర నుండి కరుణానిధి కష్టాలు వాతావరణ సంతరించుకుంది. కరుణానిధికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఏళ్లతరబడి తమిళనాడు రాజకీయాల్ని శాసించిన దిగ్గజానికి ఇప్పుడు ఎదురుగాలి చెప్పలేనంతగా వీస్తోంది. ఎన్నికల్లో ఓడిపోవడం ఓ ఎత్తైతే ఆతర్వాత కరుణానిధి కుటుంబసభ్యులు వరసగా కుంభకోణాల్లో ఇరుక్కుంటున్న తీరు మరో ఎత్తు. టూజీ స్కామ్ దెబ్బకి కరుణకి పొలమారి మంట నషాళానికంటింది. ఇప్పుడు మళ్లీ మనవడు దయానిధి మారన్ పై మరో కుంభకోణం విరుచుకుపడింది. మధురై గ్రానైట్ కుంభకోణంలో కరుణానిధి మనవడు దయానిథి మారన్ ఇరుక్కున్నారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఒలంపస్ గ్రానైట్ లైసెన్స్ ని రద్దు చేశారు. మనవడు మరో పెద్ద కేసులో ఇరుక్కోవడంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరో పెద్ద చిక్కులో పడ్డారు. ఇప్పటికే ముద్దుల కూతురు అళగిరి టూజీ స్కామ్ లో పీకల్లోతుకూరుకుపోయి ఊచలు లెక్కపెడుతున్నారు. తనకి బాగా ఇష్టమైన ముద్దులపట్టీ జైలుపాలైనందుకు కరుణానిధి ఏడవని రోజంటూ లేదు. ఇప్పుడు మళ్లీ పులిమీద పుట్రలా దయానిధి మారన్ గ్రానైట్ కుంభకోణంలో ఇరుక్కోవడం కరుణానిధికి తీరని వేదన కలిస్తోంది. తమిళనాడులో జయలలిత అధికారంలోకొచ్చాక కరుణ కుటుంబంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అలా అని జయలలిత రాజకీయపరమైన ఆరోపణలు చేస్తూ కేసుల్లో ఇరికిస్తోందని చెప్పడానిక్కూడా వీల్లేని పరిస్థితి. తమిళనాడు రాజకీయాల్ని కనుసైగలతో శాసించిన సాటిలేని మేటి రాజకీయ దిగ్గజం ఇప్పుడు చాలా చప్పబడిపోయారు.. దెబ్బమీద దెబ్బ పడుతుంటే.. తట్టుకోవడం కష్టంగానే ఉన్నా.. అంతా తలరాత అని సరిపెట్టుకోవడంతప్ప ఏమీ చేయలేని పరిస్థితి..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more