తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సరేనంటే దేనికైనా సిద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్రమంత్రి వాయలార్ రవితో చెప్పారని సమాచారం. వాయలార్ ఇంటికెళ్లిన కెసిఆర్ ఆయనతో దాదాపు 45 నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా కెసిఆర్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని రవికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కేందర్ం సై అంటే తాము ఏ ప్రతిపాదనకైనా సిద్ధమేనని చెప్పారని తెలుస్తోంది. హైదరాబాద్ విషయంలో తాము మొదటి నుండి చేస్తున్న ప్రతిపాదనకే కట్టుబడి ఉన్నామని, సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఎలాంటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని, అలా తీసుకుంటే సహించేది లేదని చెప్పారని సమాచారం. నెలాఖరులోగా రాష్ట్ర విభజన ప్రకటన చేయాలని లేదంటే ఇప్పటికే ప్రకటించినట్లుగా తెలంగాణ మిలియన్ మార్చ్ భారీ ఎత్తున నిర్వహిస్తామని, రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని చెప్పారు.
హైదరాబాదును కొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచి ఆతర్వాత తెలంగాణ రాజధానిగా చేసే అంశానికి కెసిఆర్ ఓకే చెప్పారని సమాచారం. కాగా సమైక్యాంధ్రలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కెసిఆర్ వాయలార్ రవికి నివేదిక ఇచ్చారు. కెసిఆర్ వ్యాఖ్యలు సావధానంగా విన్న రవి అన్ని అంశాలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యులకు వివరిస్తానని తెలిపారు. బేటీ అనంతరం వాయలార్ రవి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటును కోరుతున్న కెసిఆర్ అదే విషయమై మాట్లాడేందుకు తనను కలిశారని, తెలంగాణ ఏర్పాటుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలను గురించి ఆయన వివరించారని, ఆయన చెప్పిన విషయాలను పూర్తిగా విన్నానని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more