ఈ దర్శకుడు పేరు కొన్ని సంవత్సరాలు క్రితం మంచి పాపులార్ లో ఉంది. కానీ ఆయన చేసిన కొన్ని తప్పులు వలన ఆయన పేరు తెరమరుగైంది. ఇతని దర్శకత్వంలో మంచి హిట్ సినిమాలు చాలా ఉన్నాయి . అలాంటి సమయంలో ఇతను దర్శకుడు నుండి హీరోగా మారి చేతులు కాల్చుకున్న విషయం టాలీవుడ్ లో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా హలీవుడ్ సినిమా చెయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు మన తెలుగు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్‌లో కొత్త మజిలీ మొదలైంది. దర్శకునిగా తన 19 ఏళ్ల కెరీర్‌లో ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ మొదలుకుని ‘మస్త్’ వరకూ 38 చిత్రాలు డెరైక్ట్ చేసిన ఎస్వీకె హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. డివోర్స్ ఇన్విటేషన్ పేరుతో ఆయన హాలీవుడ్‌లో చేసిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. గత 2, 3 ఏళ్లుగా ఆయన ఈ సినిమా నిర్మాణంలోనే తలమునకలై ఉన్నారు. తెలుగులో హంగామా, సామాన్యుడు, డాన్ శీను, బిజినెస్ మేన్ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన ఆర్.ఆర్.మూవీమేకర్స్ సంస్థ ఈ ‘డివోర్స్ ఇన్విటేషన్’ను నిర్మించడం విశేషం. ఏడాదికి మూడు ఆంగ్ల చిత్రాలు నిర్మించాలనే తలంపుతో ఉన్న నిర్మాత వెంకట్ ఈ ‘డివోర్స్ ఇన్విటేషన్’తో అందుకు శ్రీకారం చుట్టారు.
గతంలో చంద్రసిద్దార్థ్, ఆర్పీ పట్నాయక్ వంటి దర్శకులు కూడా ఆంగ్ల భాషలో చిత్రాలు నిర్మించారు. అయితే ఇంతటి భారీస్థాయిలో ఓ తెలుగు దర్శకుడు ఆంగ్ల చిత్రం చేయడం మాత్రం ఇదే ప్రథమం. 2009లో ‘మస్త్’ చిత్రం తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి ఈ ప్రాజెక్ట్‌లోనే నిమగ్నమై ఉన్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘డివోర్స్ ఇన్విటేషన్’ అంటే విడాకుల ఆహ్వాన పత్రిక. గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి ఇదే కాన్సెప్ట్ మీద తెలుగులో ‘ఆహ్వానం’ చిత్రాన్ని తీశారు. మరి ఇంగ్లిష్ సినిమా ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more