రాష్ట్ర మంత్రివర్గంలో 7గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులున్నారని. వారు నిత్యం ఆ పార్టీ నేతలతో ఫోన్ లలో మాట్లాడుతున్నారని . పార్టీకి చేటు చేస్తున్న వారిని కాబినెట్ నుంచి తొలగించకపోతే సోనియాకు ఫిర్యాదు చేస్తామని యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుధాకర్ బాబు హెచ్చరికతో కాంగ్రెస్ పార్టీ లో కలకలం రేగిందని సీనియర్ నాయకులు అంటున్నారు. మంత్రివర్గంలో కోవర్టులున్నారని సుధాకర్ బాబు వారం క్రితమే గాంధీభవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సమక్షంలోనే సుధాకర్ బాబు ఆ వ్యాఖ్యలు చేసినా ఎవరూ ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. ఇంతవరకు సీఎం కాని ఆయన సన్నిహిత మంత్రులు ఎవరూ కూడా సుధాకర్ బాబు వ్యాఖ్యల్ని ఖండించలేదు. దీంతో నిజంగానే కోవర్టులు ఉన్నారేమోనని అనుమానాలు కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్నాయి. కొందరు నేతలు కోవర్టు మంత్రులెవరో సీఎంకు కూడా తెలుసని బలంగా వాదిస్తున్నారు. కోవర్టులపై సిఎం ఎందుకు చర్య తీసుకోవడం లేదనే అనుమానాలు కూడా నేతల్లో ఉన్నాయి.
తాజాగా సుధాకర్ బాబు మరోసారి కోవర్టుల అంశాన్ని తెరమీదికి తేవడం.. పైగా వారి జాబితా తన దగ్గరుందని పార్టీ అధ్యక్షుడికి సమర్పించానని చెప్పడంతో పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎ సుధాకర్ బాబు బొత్సకు అందించిన జాబితాలో తెలంగాణ నుంచి ఇద్దరు, కోస్తాంద్ర నుంచి ముగ్గురు, సీమ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నట్టు తెలిసింది. మరోవైపు మంత్రివర్గంపై ఆరోపణలు చేస్తోన్న సుధాకర్ బాబు వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని ప్రచారం కూడా ఉంది. కెవిపి అనుచరుడిగా ముద్రపడ్డ సుధాకర్ బాబుకు కోవర్టుల అంశాన్ని తీవ్రం చేయాలని ఆయన సూచించారనే చర్చ కూడా ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు అక్కడి గ్రూపు రాజకీయాల్లో రాయపాటికి అనుచరుడిగా ఉంటున్నారు. ఎంపీ రాయపాటి, మంత్రి కన్నా గ్రూపు పోరులో కన్నాకు వ్యతిరేకంగా రాయపాటి సుధాకర్ బాబును ప్రోత్సహించారా..? అనే చర్చ కూడా కొనసాగుతోంది. అయితే మంత్రివర్గంలో ఎవరూ కోవర్టులు లేరని మంత్రి శైలజానాద్ మోహమాటానికన్నట్లు చెప్పారు. సుధాకర్ బాబు వ్యాక్యలపై పార్టీలో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. అసలే పార్టీ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో ఆయన మంత్రివర్గంపై విమర్శలు చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం కోవర్టులను ఏరివేయాలని సీఎం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more