జైల్లో ఉన్న జగన్ కు పెళ్లి కళ వచ్చిందంటే.. జగన్ కు పెళ్లి కుదిరిందని కాదు. జైల్లో ఉన్న జగన్ కు కూడా .. ఒక పెళ్లి ఆహ్వానం అందింది. జైల్లో ఉన్న జగన్ తో పాటు .. మరి కొంత మంది రాజకీయ నాయకులకు ఈ పెళ్లి కార్డు అందినట్లు సమాచారం. జైల్లో ఉన్న జగన్ పెళ్లి కార్డు చూసి ఆనంద పడాలో లేక బాధపడలో తెలియాక అమాయకంగా జైలు గోడల వైపు చూస్తూ ఉండిపోయారని జైలు అందికారులు అంటున్నారు. అసలు జైల్లో ఉన్న జగన్ పెళ్లి కార్డు ఇచ్చే సన్నిహితం ఎవరికి ఉంటుంది చెప్పాండి . ఆయన కుటుంబ సభ్యులు మాత్రం కాదండోయ్ . ఈ వ్యక్తి ఎప్పుడు ప్రభుత్వం పై పోరాటం చేసే వ్యక్తి . బీసీలకు అన్యాయం జరిగిపోతోందంటూ అయిన దానికీ కానిదానికి కస్సుమనే బీసీ సంక్షేమ సమితి అధ్యక్షుడు కృష్ణయ్య మొహమాటంతోనో, అభిమానంతోనో, మరే ఫీలింగుతోనో కామెడీ చేస్తున్నాడనిపిస్తోంది.
మరీ చోద్యం కాకుంటే చంచల్ గూడ జైలుకు వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చిరావడం ఏంటి విచిత్రం కాకపోతే, ఆ ఆహ్వాన పత్రిక అందుకున్న వారు పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తారా? ఏమైనా…కృష్ణయ్య జైలుకు వెళ్లి తన కూతురు పెళ్లికి ఆహ్వానించిన వారిలోఉన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి మోపిదేవి, మరో బీసీ ఉద్ధారకుడు సూర్య పత్రిక అధినేత నూకరపు సూర్యప్రకాశ్ రావులు. ఈ శాల్తీల్లో ఏ ఒక్కరూ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఈ మాత్రం తెలీకుండా కృష్ణయ్య పెళ్లి పత్రికలు ఇచ్చి వచ్చిఉంటాడు అని అనుకోలేం కానీ, కృష్ణయ్య ఫీలింగ్ ఏంటనేది మాత్రం అంతుబట్టలేనిదే! ఇప్పటికే వైఎస్ విజయమ్మను వివాహానికి ఆహ్వానించిన కృష్ణయ్య ప్రత్యేకంగా జగన్ ను కలవడం మొహమాటమేనేమో! ఇక నూకారపు, మోపిదేవిలకు ఎలాగూ బీసీ ట్యాగ్ ఉంది కాబట్టి సామాజిక న్యాయం కింద వారిని ఆహ్వానించిఉండవచ్చు. మొత్తానికి జైల్లోఉన్న వారికి పెళ్లి పత్రికలు ఇచ్చిరావడం అనే విషయం ఊహించుకోవాడానికి కొంచెం తమాషా విషయమే!
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more