Bollywood actress

bollywood actress, Bollywood and Hollywood News, Star Interviews, Song and Movies Reviews and Previews, Gossip and more

bollywood actress

bollywood.gif

Posted: 07/23/2012 06:24 PM IST
Bollywood actress

bollywood actress

ఉక్కు కండరాలు  కలిగిన యువకులే  ఈ దేశానికి కావాలి.. అని స్వామి వివేకానంద చెప్పారు. వ్యాపారం క్రీడలు ఇలా రంగం ఏదైనా సరే యువత దూసుకెళ్లోంది.  వేగంగా  మారిపోతున్న  పోకడల్ని  అదుకొనేది వాళ్లే. కొత్త  బాటలో  దూసుకెళ్లేది , అసాధ్యాలను సుసాద్యం చేసేది వాళ్లే. అయితే బాలీవుడ్ లో  ఈ మంత్రం పని  చేయడం లేదు.  అక్కడ అగ్రశ్రేణి  కతానాయికులుగా  కొనసాగుతున్నది  నడివయసుకొచ్చినవాళ్లే.  ఖాన్ త్రయం అమీర్, షారుఖ్, సల్మాన్,  వీరంతా  ఇంచుమించు  ఒకే వయసువారే.  బాలీవుడ్ లో  వీరికే డిమాండ్  . మూడు పదులు  ఇమ్రాన్  ఖాన్ సినిమా అంటే  చూద్దాంలే .. అని వాయిదా వేసే హిందీ సినీ ప్రియులు  అమితాబచ్చన్  అతిథి పాత్రలో  కనిపిస్తున్నాడంటే ఎలాంటి సినిమా అయిన చూడ్డానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  అంతెందుకూ ..? వందకోట్ల  మైలు రాయిని  అందుకొన్న  కథానాయకులంతా .. యాభైకి  చేరువలో  ఉన్నవాళ్లే.  యువతరంగాలు ఇమ్రాన్  ఖాన్,  షాహిద్ కపూర్  , రణ్ బీర్ కపూర్ లకు  మాత్రం  ఆ మ్యాజిక్  సాధ్యం  కావడం లేదు.

bollywood actress

 ఓ సినిమా  మొదలు పెట్టే ముందు  యువతరాన్ని   మెప్పిస్తే చాలు నెగ్గుకు రావచ్చు అనే లెక్కలేసుకొంటారు సినీ నిర్మాతలు.  ఆ మాట అక్షర సత్యం. నచ్చిన   సినిమాని  ఒకటికి రెండుసార్లు  చూసేది  వాళ్లే మరి.  ఆ వర్గం ప్రేక్షకుల అభిరుచులు మేళ విస్తూ  కథలు వంితే   అందులో  నవతరం  కథానాయకులే కావాలి. ఇమ్రాన్ ఖాన్ (29) , రణబీర్ కూపర్ (29)  షాహిద్ కపూర్  (3)  ఇమ్రాన్  హష్మి (33)  వీరంతా  యువతరాన్ని  లక్ష్యంగా  చేసుకొని కథలు ఎంచుకుంటుంటారు.  వాటిలో కొన్ని బాక్సా ఫీసు దగ్గర విజయం  సాధించినా  రూ. వంద కోట్ల వసూళ్ల జాబితాలో చేరలేకపోయాయి.  

bollywood actress

అమీర్ ఖాన్ (47)  నటించిన గజిని , త్రీ  ఇడియట్స్  చిత్రాలు  రూ. వంద కోట్ల క్లబ్ లో చేరాయి.  షారుఖ్ ఖాన్ (46)  రా. వన్  తో ఆ ఘనత సాధించారు.  సల్మాన్  ఖాన్  (46) ఖాతాలో  రెండు సినిమాలున్నాయి.  బాడీగార్డ్ , దబాంగ్  సినిమాలు రూ. వంద కోట్లు వసూళ్లు  సాధించాయి.  అజయ్  దేవగణ్ (43) అక్షయ్ కుమార్ (44)  కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.  అంతెందుకూ  ..?  వయసులో  అర్థ  సెంచరీ  చేసిన  సంజయ్ దత్  (52)  సినిమా అగ్ని  పథ్  రూ. వంద కోట్ల  మార్కు దాటింది.  జిందగీ న మిలెగీ దోబారా , అగ్ని పథ్ సినిమాలతో  హ్రుతిక్ రోషన్ (38) వంద కోట్ల కథానాయకుడు  అనిపించుకొన్నారు.  వసూళ్లలోనే కాదు, పారితోషికం  అందుకోవడంలోనూ వీరిదే  హహ. ఒక దశలో  విజయాల్లేక  ఇబ్బందులు పడిన అజయ్ దేవగన్ , అక్షయ్  కుమార్ లు  నలభై దాటిన తరువాత తమ ప్రతాపం  చూపిస్తున్నారు.   బాలీవుడ్ లో మాస్ , యాక్షన్  సినిమాలతే  రాజ్యం. ఈ మద్య కాలంలో  ఆ తరహా  కథలే  బాక్సాఫీసుని గెలిచాయి.  షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్  లాంటి అగ్ర కథానాయకులు  సినిమాలు విదేశాల్లో  కూడా చూస్తారు.  అక్కడ వారికి అభిమానులున్నారు.  యువ కథానాయకులు ఆ స్థాయికి  చేరుకోవడానికి ఇంకొంచెం  సమయం పడుతుంది.  వారెక్కువా  ప్రేమకథలకే పరిమితం  అవడం మరో కారణం  అని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu suspends 4 rebel mlas
India singapore to share information on tax evaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more