ఐరన్ లెగ్ తో సిని ప్రపంచంలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్ .. అనేక మంది హీరోలతో చేసినప్పటికి ఆమెకు ఒక్క హిట్ కూడా సాదించలేకపోయిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో .. శ్రుతి ఒక పవర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆమెకు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన గోల్డన్ హ్యాండ్ ఇవ్వటం జరిగింది. పవన్ దగ్గర పవర్ అందుకున్న శ్రుతి హాసన్.. గబ్బర్ సింగ్ సినిమాలో 1000 వోల్టు బల్లు మాదిరి తన అందాలను వెలిగించింది. శ్రుతి హాసన్ .. అందాలు పవన్ కళ్యాణ్ పవర్ కలిసి గబ్బర్ సినిమా కు భారీ కలెక్షన్ లు కురిపించాయి. అయితే ఐరన్ లెగ్ అని ముద్రపడిన శ్రుతి హాసన్ పవన్ స్పర్శతో.. గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఇప్పుడు శ్రుతి హాసన్ టాప్ హీరోయిన్ల రేంజ్ లో ఉన్నదని ఫిలింనగర్లో టాక్ వినబడుతుంది.
అయితే అందులో కొన్ని శ్రుతి హాసన్ అనుభవాలు చెబుతుంది. శరీరం అన్నాక అప్పుడప్పుడు జ్వరం, జలుబులాంటివి రావడం సహజం. ఆ మాత్రం దానికే మంచానికి అతుక్కుపోతే ఇంకా నీరసపడిపోతాం. అందుకే నేనిలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అస్సలు పట్టించుకోకుండా పని చేస్తుంటానని శ్రుతిహాసన్ చెబుతుంది. ఇటీవల ఈ బ్యూటీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. కానీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోలేదు. ప్రస్తుతం ‘గబ్బర్‌సింగ్’ విజయాన్ని ఆస్వాదిస్తూ, తన తదుపరి చిత్రాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటున్నారు శ్రుతి.శ్రుతికి ఒక పట్టాన నిద్రపట్టదట. అది ఆమెకు వరం.. శాపం కూడా. నిద్రపట్టదు కాబట్టి మ్యూజిక్‌కి సంబంధించిన నోట్స్ రాసుకుంటుంటానని చెబుతుంది. రాత్రిపూట దాదాపు నేనిలా ఏదో ఒక ప్రయోజనాత్మక పని చేస్తానని అంటుంది. నిద్రాదేవి ఎప్పుడు ఆవహిస్తుందా అని ఎదురుచూస్తూ, టైమ్ వేస్ట్ చేసే బదులు ఇలా ఏదో ఒకటి చేస్తుంటాను. అలా కొన్ని గంటలు రాస్తూనో, చదువుతూనో తెల్లవారుతుందనగా కునుకు తీసేస్తాను. నిద్రపోకపోవడంవల్ల పనులు చేసుకుంటాను కానీ.. త్వరగా అలసిపోతుంటాను. అందుకే ‘నిద్రలేమి’ వరం, శాపం మని అంటుంది శ్రుతి.
సినిమా ప్రపంచానికి ‘సమయం’తో పని లేదు. రాత్రి, పగలు తేడా లేకుండా షూటింగ్స్ చేస్తుంటాం. ఈ వృత్తి అంటే నాకెంతో ఇష్టం. అమ్మా నాన్న ఆర్టిస్టులు కావడంవల్ల, చిన్నప్పట్నుంచి సినిమా వాతావరణంలో పెరిగి ఉండటంవల్ల ఈ రంగం అంటే మమకారం ఏర్పడి ఉండొచ్చు. నా చిన్నప్పట్నుంచి అమ్మా నాన్న కెరీర్ చూశాను. వారి గురించి వచ్చిన వదంతులు కూడా విన్నాను. అందుకేనేమో ఇప్పుడు నా గురించి ఏదైనా రూమర్స్ వస్తే లైట్ తీసుకోగలుగుతున్నాను. ‘ఫలానా హీరోతో శ్రుతిహాసన్‌కి ఎఫైర్ అట’ అని ఎవరైనా వార్త రాస్తే.. తర్వాత ఏ హీరోతో లింక్ పెడతారా? అనుకుని నవ్వుకుంటాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. వెరైటీ పాత్రలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేను ఏ పాత్ర చేయడానికైనా రెడీ. కథ, పాత్రను దర్శకుడు నారేట్ చేసినప్పుడు నేను ఎక్సయిట్‌మెంట్‌కి గురైతే, మరో ఆలోచనకు తావివ్వకుండా ఆ సినిమా ఒప్పేసుకుంటాను. నటిగా నన్ను నిరూపించుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోనని శ్రుతి హాసన్ చెబుతుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more