ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణను తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ అద్యక్షుడుగా నియమించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని కదనాలు వస్తున్నాయి.బాలకృష్ణ కూడా తాను పార్టీలో క్రియాశీలకం అవడానికిగాను ఏదో ఒక పదవి ఉండాలని బావిస్తున్నారని అంటున్నారు. ఈ విషయమై పార్టీ అదినేత చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు.అయితే బాలకృష్ణ నాయకత్వ పటిమ కార్యకర్తలను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నదానిపై భిన్న వాదనలు ఉన్నాయి. ఇంతకాలం బాలకృష్ణపై ఎన్ని విమర్శలు ఉన్నా, ఆయన క్రియాశీలక రాజకీయాలలో రాలేదు కనుక వాటి జోలికి ప్రత్యర్దులు వెళ్లడం లేదు. ఒక్కసారి ఏదైనా పదవి తీసుకుని రాజకీయాలలోకి వచ్చారంటే , ఆ వెంటనే బాలకృష్ణ ఇంటిలో జరిగిన కాల్పుల ఘటనపై విమర్శలు, మళ్లీ వివాదాలు, అవకాశం వస్తే కోర్టుకు వెళ్లడం వంటివి కూడా జరగవచ్చు.ఇది ఒకరకంగా ఆయనకు ఇబ్బందే అవుతుంది. అంతదాకా ఎందుకు పార్టీ మారినందుకే జగన్ పై ఎన్ని కేసులు పెట్టారో అంతా చూస్తున్నారు. ఈ అనుభవం కళ్లెదుట ఉండి కూడా బాలకృష్ణ వస్తారా?వచ్చినా సఫలం అవుతారా?
తాజా పరిణామాలు చూస్తే. వచ్చే ఎన్నికల సమయానికి సంపూర్ణమైన రాజకీయ నాయకుడిగా మారడానికి ఆయన స్కెచ్ వేశారు. కష్ట కాలంలో ఉన్న పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ఆయన తనవంతు తోడ్పాటునందించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని నడిపించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదని.. ఆయనకు తోడుగా తానూ తోడ్పాటునందిస్తానని ఇటీవల బాబుతో సమావేశమైన బాలయ్య చెప్పినట్లు సమాచారం. ఇకపై సినిమా షూటింగులకు నెలలో 15 రోజులే కేటాయించి, మిగత 15 రోజులు పార్టీ కోసం కేటాయిస్తానని బాలయ్య చెప్పినట్లు సమాచారం. పార్టీలో ఓ ముఖ్య పదవిని బాలయ్య కోరుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి బాబు గారు బావకు ఏ పదవి కట్టబెడతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more