చల్లకు వచ్చి ముంత దాచినట్లుగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తుంటారు.మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిసిన తర్వాత టిడిపి ఆమెను సస్పెండ్ చేయడంపై కల్పన స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబును విమర్శించడానికి వారు ఇదొక అవకాశంగా తీసుకుంటున్నారు.గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బాటలోనే కల్పన కూడా మాట్లాడుతూ తనను పార్టీనుంచి బయటకు పంపినందునే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెబుతున్నారు. గడుసుదనం అంటే ఇదేనేమో. విజయవాడలో వల్లభనేని వంశీ జగన్‌ను రోడ్డుపై కలిస్తే ఏమీ చేయలేదు...రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి జగన్‌తో మంతనాలు జరిపితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అంతెందుకు బాబు తానే స్వయంగా చిదంబరంను ఎవరికీ తెలియకుండా కలిశారు. మొన్న ప్రణబ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కానీ నేను రాజమోహన్ రెడ్డిని కలిసినందుకే ఎలాంటి సంజాయిషీ గానీ, వివరణ గానీ కోరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’ అని కల్పన అన్నారు. సామాజిక సమతౌల్యం కోసమే తనను పాలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు తప్ప కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు బాబు తమ సూచనలు, సలహాలు తీసుకున్నది లేదని ఆమె అన్నారు. తాను 2004లో పార్టీలో చేరి ఎనిమిదేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాననీ డబ్బు, సమయం వృథా చేసుకున్నానని ఆమె వెల్లడించారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇస్తానని బాహాటంగా చెప్పే చంద్రబాబు ఆచరణలో అది చేయరని అన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు వచ్చినపుడు కోట్లు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయో వారికే ఇచ్చారనీ పదవులను బాబు వేలం వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్యాకేజీలు ఇస్తున్నందునే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారని బాబు చేస్తున్న విమర్శలన్నీ కట్టుకథలనీ జగన్ వెంట జనం ఉన్నారు కనుకనే అందరూ వస్తున్నారని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికోట్లు ఇస్తే జగన్ మాదిరిగా ప్రజాభిమానం పొందగలరని ఆమె అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more